AUSvsENG: ఏమీ డిఫెండ్ చేసుకోకుండానే ముగిసిన ఇంగ్లండ్ కథ!
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్‌లో అడుగు పెట్టిన ఇంగ్లండ్.. ఏడు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో కూడా 33 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓడింది. ఈ ఓటమితో సెమీస్ రేసు నుంచి ఇంగ్లండ్ అధికారికంగా తప్పుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ట్రావిస్ హెడ్ (11), డేవిడ్ వార్నర్ (15) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే స్టీవ్ స్మిత్ (44), మార్నస్ లబుషేన్ (71), కామెరూన్ గ్రీన్ (47), మార్కస్ స్టొయినిస్ (35) రాణించడంతో ఆసీస్ జట్టు కొంత తేరుకుంది. చివర్లో ఆడమ్ జంపా (29) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.

అదే సమయంలో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లతో రెచ్చిపోయాడు. దీంతో ఆసీస్ జట్టు 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో తొలి బంతికే ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన జానీ బెయిర్‌స్టో (0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జో రూట్ (13), జాస్ బట్లర్ (1), లియామ్ లివింగ్‌స్టోన్ (2) ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.
కానీ డేవిడ్ మలాన్ (50), బెన్ స్టోక్స్ (64) ఇంగ్లండ్ అభిమానుల్లో ఆశలు రేపారు. వీళ్లిద్దరూ కలిసి ఈ మ్యాచులో జట్టును గెలిపించి కనీసం జట్టు పరువు నిలుపుతారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ వాళ్లిద్దరూ అవుటవడంతో మళ్లీ టెన్షన్ పడిపోయారు. ఇలాంటి సమయంలో మొయీన్ అలీ (42), క్రిస్ వోక్స్ (32), అదిల్ రషీద్ (20) కొంత ఆశలు రేపారు. కానీ ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి.
ఇంగ్లండ్ జట్టు 48.1 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ 33 పరుగుల తేడాతో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఆసీస్ బౌలర్లలో జంపా మూడు వికెట్లతో సత్తా చాటగా.. స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అటు బ్యాటుతో, ఇటు బంతితో మ్యాచ్‌ను మలుపు తిప్పిన జంపాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications