Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

David Warner: నేడే ఈ మోడ్రన్ గ్రేట్ బర్త్ డే.. ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా?

డేవిడ్ వార్నర్ పుట్టిన రోజు సందర్భంగా : ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో బెస్ట్ ఓపెనర్ ఎవరు? అని అడిగితే.. కొద్దిగా ఆలోచించి చాలా మంది చెప్పే పేరు డేవిడ్ వార్నర్. ఈ ఆస్ట్రేలియా స్టార్‌కు భారత్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే అని చెప్పాలి. అది కూడా మన హైదరాబాద్‌లో మరీ ఎక్కువ. ఎందుకంటే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు తొలి ట్రోఫీ అందించిన కెప్టెన్ వార్నరే.

ఇప్పుడు అతను సన్‌రైజర్స్ తరఫున ఆడకపోయినా.. ఆ అభిమానం మాత్రం హైదరాబాదీల్లో తగ్గలేదు. దానికితోడు తెలుగు సినిమాలంటే వార్నర్‌కు పిచ్చి. టాలీవుడ్ సాంగ్స్‌లో హీరోల ఫేస్ తీసేసి తన ఫేస్ పెట్టుకొని రీల్స్ చేయడం అతనికి అలవాటు. ఇలా ఎంత తమాషాగా ఉన్నా సరే.. బ్యాటింగ్‌లో ఫెయిలైతే ఫాలోయింగ్ తగ్గడం సహజమే.

 World Cup 2023 Australia opener David Warner celebrating birthday

కానీ వార్నర్ తన బ్యాటులో చాలా రికార్డులు బద్దలు కొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో కూడా వరుసగా రెండు సెంచరీలు బాదిన అతను.. వరల్డ్ కప్‌లలో ఏకంగా 6 సెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్ బ్యాటర్లలో ఓవరాల్‌గా 48 శతకాలతో విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక శతకాలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

టెస్టుల్లో కూడా వార్నర్ అద్భుతమైన బ్యాటరే. సుదీర్ఘ ఫార్మాట్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదాడీ ఎడం చేతి వాటం ఓపెనర్. టెస్టుల్లో ఓవరాల్‌గా 8,487 పరుగులు చేశాడు. ఇక వైట్ బాల్ క్రికెట్‌లో అయితే బెస్ట్ ఓపెనర్లలో ఒకడిగా పేరొందాడు. వన్డేల్లో 6729 పరుగులు చేశాడు. చివరకు ఐపీఎల్‌లో కూడా పలు రికార్డులు బద్దలు కొట్టాడు.

ఐపీఎల్‌లో పలు టీమ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్.. 6397 పరుగులు చేశాడు. మొత్తం నాలుగు సెంచరీలు బాదాడు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు. ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్-5లో ఉన్నాడు.

ఇన్ని రికార్డులు బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్.. అక్టోబర్ 27న పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. దీంతో ఫ్యాన్స్ అంతా అతనికి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Story first published: Friday, October 27, 2023, 9:22 [IST]
Other articles published on Oct 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+