Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా అండర్ ప్రెజర్: భారీ స్కోర్‌పై కన్నేసిన ప్రొటీస్: దిగ్గజాల పోరు

లక్నో: వరల్డ్ కప్ 2023లో భాగంగా నేడు క్రికెట్ దిగ్గజాలు తలపడనున్నాయి. ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియం దీనికి వేదిక. సమవుజ్జీ జట్లు కావడంతో స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.

తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది భారత్. ఆ జట్టు నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఊది పడేసింది. విరాట్ కోహ్లీ- 87, కేఎల్ రాహుల్- 97 పరుగులతో ఆసీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓటమితో తన వరల్డ్ కప్ 2023 హంటింగ్‌ను మొదలు పెట్టిన కంగారూలు ప్రస్తుతం మరో బలమైన జట్టుతో ఎదుర్కొనాల్సి రావడంతో పూర్తి ఒత్తిడిలో ఉంటోంది.

World Cup 2023, AUS vs SA: Australia playing 11 deets inside

దీనికి భిన్నమైన పరిస్థితిలో ఉంది దక్షిణాఫ్రికా. తొలి గేమ్‌లో శ్రీలంకపై భారీ విజయం సాధించిన ఊపులో ఉంది. ఆ మ్యాచ్‌లో ప్రొటీస్ 428 పరుగులను నమోదు చేసిన విషయం తెలిసిందే. ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కారు. ఇప్పుడు ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోన్నారు.

ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. దాదాపుగా టీమిండియాతో ఆడిన ప్లేయర్లనే తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నుస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ( వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్‌ను ఆడించవచ్చు.

Story first published: Thursday, October 12, 2023, 9:35 [IST]
Other articles published on Oct 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+