Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: స్టేడియానికి క్యూ కట్టిన సెలెబ్రిటీలు.. సచిన్, అనుష్క శర్మ కూడా వచ్చేశారుగా!

క్రికెట్‌లో అతిపెద్ద వైరం ఇండియా, పాకిస్తాన్ అని తెలిసిందే. అదే వరల్డ్ కప్ వంటి బడా వేదికపై ఈ రెండు దేశాలు తలపడితే ఆ మ్యాచ్‌కు ఉండే హైప్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇదే జరుగుతోంది. బడా బడా సెలెబ్రిటీలు కూడా ఈ హై ఇంటెన్సిటీ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్‌కు క్యూ కడుతున్నారు.

ఈ క్రమంలో టీమిండియా కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ భార్య, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా అహ్మదాబాద్ వచ్చేసింది. ఈ మ్యాచ్ కోసమే ఆమె ఇక్కడకు వచ్చింది. ఆమె ఎయిర్‌పోర్టులో దిగిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రయాణించిన ఫ్లైట్‌లో సచిన్ టెండూల్కర్, దినేష్ కార్తీక్ కూడా ఉండటం గమనార్హం.

World Cup 2023 Anushka Sharma and Sachin Also arrives at Ahmedabad for INDvsPAK clash

సచిన్, అనుష్కతో కలిసి సెల్ఫీ దిగిన దినేష్ కార్తీక్.. దాన్ని తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేనప్పుడు కూడా భర్తను సపోర్ట్ చేయడానికి అనుష్క ఇలాగే స్టేడియానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ మంచి ఫామ్ అందుకున్న నేపథ్యంలో పాకిస్తాన్‌ను కోహ్లీ చెడుగుడు ఆడటం ఖాయమని, అది చూసేందుకే అనుష్క వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక పాకిస్తాన్ అంటే చెలరేగే భారత ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. కెప్టెన్ రోహిత్ కూడా పాక్‌పై విశ్వరూపం చూపిస్తుంటాడు. వీళ్లిద్దరూ కనుక ఈ మ్యాచ్‌లో చెలరేగితే మ్యాచ్ ఒక రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాక్ కూడా ఎలాగైనా భారత్‌ను ఓడించి, వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌పై విజయం లేని చరిత్రను తిరగరాయాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో భారత్‌పై ఐదు వికెట్లు తీసుకుంటానంటూ షహీన్ అఫ్రిదీ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Story first published: Saturday, October 14, 2023, 13:11 [IST]
Other articles published on Oct 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+