Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFGvsAUS: ఆ స్టార్ ప్లేయర్ల రీఎంట్రీ.. మరో సంచలనం చూస్తామా?

World Cup 2023: వరల్డ్ కప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా, అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ మ్యాచ్ జరిగేకొద్దీ మంచు ప్రభావం ఉందని తెలుస్తోంది.

అందుకే షాహిదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో పిచ్ నుంచి స్పిన్నర్లకు చక్కని సహకారం వస్తుందని నిపుణులు చెప్పారు. ఇది కూడా షాహిదీ నిర్ణయానికి ఒక కారణమే. రెండో ఇన్నింగ్సులో స్పిన్, సీమ్‌కు పిచ్ సహకరిస్తుందని అనుకుంటున్నా. తాము ఇప్పటి వరకు ఛేజింగ్ చక్కగా చేశామని, అయితే ప్రత్యర్థితోపాటు పిచ్‌ను కూడా చూసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నాడు.

World Cup 2023 AFGvsAUS will afghanistan make another history

ఈ మ్యాచ్‌కు ముందు సచిన్ నుంచి ఆఫ్ఘన్ జట్టు కొన్ని సలహాలు తీసుకుంది. దీని గురించి మాట్లాడుతూ.. ఈ క్రీడలో సచిన్ ఒక లెజెండ్ అని, అతని నుంచి పాఠాలు నేర్చుకోవడం చాలా ఎగ్జయింటింగ్‌గా ఉందని చెప్పాడు. అలాగే తమ జట్టులో ఒక మార్పు చేశామని తెలిపాడు. ఫజల్‌హాక్ ఫరూఖీ స్థానంలో నవీన్ ఉల్ హక్‌ను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.

టాస్ ఓడిపోవడం తమ ప్లాన్లపై ఎలాంటి ప్రభావం చూపదని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పాడు. వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించడం, తమ ఆటతీరు సంతోషకరంగా ఉన్నాయని అన్నాడు. ఇదే జోరు భవిష్యత్తులో కూడా కొనసాగాలని కోరుకున్నాడు. స్మిత్ పూర్తి ఫిట్‌గా లేడని, దీంతో అతను ఈ మ్యాచ్ ఆడటం లేదని వెల్లడించాడు.

అతనితోపాటు కామెరూన్ గ్రీన్ కూడా ఆడటం లేదని కమిన్స్ చెప్పుకొచ్చాడు. వీళ్లిద్దరి స్థానంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్ తిరిగి జట్టులోకి వచ్చారని తెలియజేశాడు. ఇక పిచ్ గురించి కూడా పెద్దగా ఆలోచించడం లేదన్నాడు. ఎందుకంటే తమ వద్ద చాలా బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయని, కాబట్టి పెద్దగా టెన్షన్ పడటం లేదని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, November 7, 2023, 13:52 [IST]
Other articles published on Nov 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+