Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: బంగ్లా స్పిన్నర్ల దెబ్బకు ఆఫ్ఘన్ బ్యాటర్లు విలవిల.. స్వల్ప స్కోరుకే ఆలౌట్!

World Cup 2023: వరల్డ్ కప్ లో తాము ఆడుతున్న తొలి మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు తేలిపోయారు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఆఫ్ఘన్ తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 156 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ ముందుగా బౌలింగ్ తీసుకొని మంచి పని చేశాడని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు తడబడ్డారు. కేవలం రహ్మనుల్లా గుర్బాజ్ (47) ఒక్కడే తన కొంత ప్రయత్నం చేశాడు. మిగతా వారిలో ఇబ్రహీం జద్రాన్ (22), అజ్మతుల్లా ఒమర్జాయ్(22) మాత్రమే కనీసం 20 పరుగుల మార్క్ దాటారు. దీంతో ఆఫ్ఘన్ జట్టు ఏ దశలోనూ మంచి స్కోరు చేసేలా కనిపించలేదు.

World Cup 2023 Afghan batters fail as Bangla spinners shine

ఇక బంగ్లా బౌలర్లలో కెప్టెన్ షకిబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్ ఇద్దరూ కూడా చెరో మూడు వికెట్లతో రాణించారు. షోరిఫుల్ ఇస్లాం రెండు వికెట్లు తీసుకోగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు. బంగ్లా బౌలర్స్ లో మహ్మదుల్లా తప్ప అందరికీ వికెట్లు దక్కాయి.

దీంతో ఆఫ్ఘన్ జట్టు మొత్తం 37.2 ఓవర్లలో కేవలం 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇది చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో బ్యాటుతో బాగా రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ఆఫ్ఘన్ ఇలా తేలిపోయింది ఎంటి? అని ఫీల్ అవుతున్నారు.

అదే సమయంలో షకిబ్ వంటి స్పిన్నర్లు ఈ పిచ్ పై రాణించారు కాబట్టి.. రషీద్ ఖాన్ కూడా చెలరేగుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏదేమైనా ఈ వరల్డ్ కప్ లో తొలి బోణీ ఎవరు కొడతారని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ అయితే ఇంకా బాగుంటుందని కొందరు అంటున్నారు.

Story first published: Saturday, October 7, 2023, 14:15 [IST]
Other articles published on Oct 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+