Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఇది మా ఇల్లు అంటున్న ఆఫ్ఘన్ కెప్టెన్.. బోణీ కొడతాడా?

వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు రెడీ అయింది. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచులో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తలపడుతున్నాయి. భారత్ లోని చిన్న స్టేడియాల్లో ధర్మశాల ఒకటి. దానికితోడు ఇక్కడ పేసర్లకు మంచి బౌన్స్ లభిస్తుంది. కాబట్టి బౌలర్లు కూడా ఈ పిచ్ ను ఎంజాయ్ చెసే ఛాన్స్ ఉంది.

అదే సమయంలో మైదానం చిన్నది కావడంతో బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకిబల్ హసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

World Cup 2023 Affhan captain says India is our home

ఇది చేసింగ్ పిచ్ అని, ఆరంభంలో పేసర్లకు పిచ్ నుంచి సహకారం అందుతుందని షకీబ్ అభిప్రాయపడ్డాడు. ఇలా ఐదోసారి దేశం తరఫున వరల్డ్ కప్ ఆడటం గర్వంగా ఉందని చెప్పాడు. అదే సమయంలో తాము మంచి బ్యాలన్స్ ఉన్న టీంతో బరిలో దిగుతున్నట్లు ఆఫ్ఘన్ సారథి షాహిదీ చెప్పాడు.

తమ ప్లేయర్లు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉందని, అది లేని వారికి కూడా భారత్ లో పరిస్థితులు కొట్టెంకాదని అన్నాడు. భారత్ తమకు స్వదేశం వంటిదే అన్నాడు. మరి ఈ మ్యాచులో ఎవరు బోణీ కొడతారో చూడాలి.

Story first published: Saturday, October 7, 2023, 10:44 [IST]
Other articles published on Oct 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+