AB de Villiers: ఈ ఏడాది టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో కూడా చెలరేగుతున్నాడు. తాజాగా సౌతాఫ్రికాపై అద్భుతమైన సెంచరీ బాదిన కోహ్ల.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా సచిన్ రికార్డును సమం చేశాడు. అంతేకాదు, అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన ప్లేయ్‌గా కూడా నిలిచాడు.
సచిన్ ఈ రికార్డు సాధించడానికి ఏకంగా 451 ఇన్నింగ్సులు ఆడాడు. కానీ కోహ్లీ మాత్రం కేవలం 49 వన్డేల్లోనే ఈ రికార్డు సమం చేసి చెలరేగాడు. దీనిపై సౌతాఫ్రికా లెజెండ్, విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఏ జనరేషన్ ప్రకారం చూసుకున్నా విరాట్ కోహ్లీ చాలా వేగంగా ఈ రికార్డు సాధించాడని మెచ్చుకున్నాడు.

కోహ్లీ ఈ విషయంలో చాలా అద్భుతమైన ఫీట్ సాధించాడని అన్నాడు. కోహ్లీ సరిగ్గా తన జన్మదినం రోజునే ఈ ఫీట్ సాధించడం గమనార్హం. సౌతాఫ్రికాపై 121 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు కోహ్లీ. అనంతరం సౌతాఫ్రికాను 83 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా ఏకంగా 243 పరుగుల భారీ విజయం సాధించింది.
దీనిపై మాట్లాడిన డివిలియర్స్.. 'ఇలా 49 సెంచరీలు చేయడానికి కోహ్లీకి 277 ఇన్నింగ్సులు మాత్రమే పట్టింది. ఇది కొత్త జనరేషన్ అయినా కూడా ఇది చాలా వేగంగా అందుకున్న ఫీట్ అనే చెప్పాలి' అన్నాడు. అలాగే కోహ్లీతో తనకున్న వ్యక్తిగత బాండింగ్ గురించి కూడా డివిలియర్స్ చెప్పాడు.
'మేం ఇద్దరం చాలా క్లోజ్. ఒక విధంగా మేం అన్నదమ్ములంలా. విరాట్ ఇలా రాణిస్తున్నందుకు నేను చాలా హ్యాపీ. ఇది కొత్త జనరేషన్ నిజమే. అయినా సరే మనం కేవలం నెంబర్లను కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా సచిన్ ఈ ఫీట్ సాధించడానికి 451 ఇన్నింగ్సులు పట్టింది. అదే కోహ్లీకి 277 ఇన్నింగ్సులు మాత్రమే పట్టింది' అన్నాడు.
'సచిన్‌తో పోలిస్తే కోహ్లీ చాలా స్పీడ్‌గా ఈ ఫీట్ సాధించాడు. అయితే ఈ ఆట కూడా ప్రస్తుతం చాలా మారిపోయింది. సచిన్ టైంతో పోలిస్తే ఇప్పుడు ఆటలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం మంచి పిచ్‌పై 250 పరుగులు చేశామంటే నవ్వుతారు. ఇప్పుడు అందరూ 400 స్కోరు కోసం చూస్తున్నారు' అని డివిలియర్స్ పేర్కొన్నాడు.