PAKvsAFG: బాబర్.. ఇంత చెత్తగా ఆడితే ఇక ఇంటికే.. మాజీ దిగ్గజం కీలక సలహా!
అత్యంత హైప్‌తో ఈ వరల్డ్ కప్‌లో ఎంట్రీ ఇచ్చి, అత్యంత దారుణంగా విఫలమవుతున్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అతను పాక్ కెప్టెన్ బాబర్ ఆజామే. వరల్డ్ కప్ మొదలవడానికి ముందు అందరూ కూడా ఈ మెగా టోర్నీలో బాబర్ పరుగుల వరద పారిస్తాడని అన్నారు. కానీ ఆ అంచనాలు అన్నింటినీ బాబర్ తలకిందులు చేశాడు.
ఇప్పటి వరకు పాకిస్తాన్ ఐదు మ్యాచులు ఆడగా.. వాటన్నింటిలో కలిపి బాబర్ చేసిన పరుగు 83 మాత్రమే. వాటిలో కూడా భారత్‌పై అతను హాఫ్ సెంచరీ చేశాడు. అంటే మిగతా నాలుగు మ్యాచుల్లో కలిపి అతను చేసింది 33 పరుగులే అన్నమాట. దీనిపై టీమిండియా మాజీ దిగ్గజయం ఆకాష్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'బాబర్ పరుగులు చేయకతప్పదు. ఇంత పెద్ద పార్టీ పెడితే.. అతను రాకపోతే ఎలా? అసలు నువ్వు ఒక సూపర్ స్టార్‌వి. కానీ ఇప్పటి వరకు హీరో తమ్ముడి పాత్ర కూడా పోషించలేదు. ఇప్పుడైనా ఆ పని చెయ్యి' అని ఆకాష్ చోప్రా అన్నాడు. అలాగే ఆఫ్ఘన్‌తో మ్యాచులో వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కూడా మళ్లీ జట్టులో చేరతాడని చోప్రా అభిప్రాయపడ్డాడు.
అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌ను తక్కువ అంచనా వేయొద్దని చోప్రా వార్నింగ్ ఇచ్చాడు. వాళ్లను తక్కువ అంచనా వేస్తే తిప్పలు తప్పవన్నాడు. 'టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ ఎంచుకోండి. కనీసం 250 రన్స్ చేయండి. అప్పుడు చూడండి మ్యాచ్ ఎంత మజాగా ఉంటుందో' అని పాక్‌కు సలహా ఇచ్చాడు.
ఈ రెండు జట్లలో పాక్ మెరుగైన టీమే కానీ.. ఇప్పటి వరకు ఆ జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని చోప్రా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ కూడా ఓడితే ఇక పాక్ పని అయిపోయినట్లేనని స్పష్టం చేశాడు. 'భారత్ చేతిలో ఓడటం పెద్ద సమస్య కాదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పాక్ ఓడకూడదు' అని పాక్ లెజెండ్ అక్తర్ అన్న మాటలు గుర్తుచేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications