Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsPAK: రోహిత్ డై హార్డ్ ఫ్యాన్.. హిట్ మ్యాన్ కోసం అనూహ్యమైన గిఫ్ట్!

భారత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒకడు. దేశంలో ఏ మూలకు వెళ్లినా హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ కనిపిస్తూనే ఉంటారు. ఈ ఏడాది భారత్ కనుక వరల్డ్ కప్ గెలవాలంటే రోహత్ ఫామ్ చాలా కీలకం అని చాలా మంది భావిస్తున్నారు.

2011లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రోహిత్ శర్మ లేడు. ఆ తర్వాత 2015, 2019 మెగాటోర్నీల్లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. కానీ భారత జట్టు మాత్రం ఫైనల్ కూడా చేరలేకపోయింది. ఈ క్రమంలో ఈ ఏడాది జరుగుతున్న వన్డే రవ్ల్ కప్.. రోహిత్‌కు చివరి వరల్డ్ కప్ అని వార్తలు వస్తున్నాయి.

World cup 2023 A special gift to Rohit Sharma before INDvsPAK clash

ఈ క్రమంలో ఈసారి హిట్ మ్యాన్ ఎలాగైనా ఈ ట్రోఫీ నెగ్గాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒక అభిమాని తన ఆశలకు ఒక చిన్న రూపం కూడా ఇచ్చాడు. అహ్మదాబాద్‌కు చెందిన ఒక బంగారం పని చేసే వ్యక్తి.. హిట్‌మ్యాన్‌పై తన అభిమానాన్ని చాటుకోవడానికి అనూహ్య విధానాన్ని ఎంచుకున్నాడు.

చాలా శ్రమ పడి చిన్న వరల్డ్ కప్ ట్రోఫీ తయారు చేశాడీ జ్యువెలర్. ఇది 0.900 గ్రాముల బరువు ఉందట. బంగారంతో తయారు చేసిన ఈ చిన్ని ట్రోఫీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అందించాలని ఆ ఫ్యాన్ అనుకుంటున్నాడు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ముందు అహ్మదాబాద్‌లో రోహిత్‌ను కలిసి ఈ ట్రోఫీ అందించబోతున్నాడట ఈ డై హార్డ్ ఫ్యాన్.

ఇక ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడిన తొలి మ్యాచులో రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో మ్యాచులో ధనాధన్ షాట్లతో విరుచుకుపడి శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ సెంచరీ చూసిన వాళ్లంతా కూడా రోహిత్ మళ్లీ ఫామ్ అందుకున్నాడని అంటున్నారు. మరి పాక్‌పై అతను ఎలా రాణిస్తాడో చూడాలి.

Story first published: Friday, October 13, 2023, 11:41 [IST]
Other articles published on Oct 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+