Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: ఏంటా సైగలు..? పాక్ మ్యాచ్ తర్వాత కోహ్లీ చేసిన పని వైరల్!

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట ఎంత స్పెషలో వేరే చెప్పక్కర్లేదు. స్టేడియంలో ఇద్దరూ కనిపించారంటే చాలు కెమెరాలన్నీ వాళ్లవైపే ఉంటాయి. వాళ్లిద్దరి మధ్య జరిగే చిన్న చిన్న ఇంటరాక్షన్స్‌ని కూడా రికార్డ్ చేసేస్తాయి. తాజాగా పాకిస్తాన్ మ్యాచ్‌ తర్వాత కూడా ఇలాంటి ఓ వీడియో బయటకొచ్చింది.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సూపర్ విక్టరీ తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా గ్రౌండ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్లలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. అయితే కొద్ది సేపటి తర్వాత స్టాండ్స్‌లో కూర్చుని ఉన్న అనుష్క శర్మ వైపు తిరిగి ఏదో సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

World Cup 2023 A cute video of Virat Kohli and Anushka Sharma from INDvsPAK match going viral

స్టాండ్స్‌లో నుంచి ఎవరో ఫ్యాన్ ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియోను బట్టి చూస్తే స్టాండ్స్‌లో ఉన్న అనుష్కతో.. ఇద్దరం కలిసి కారులో పోదాం అని, అది కూడా అనుష్క కారులో వెళదామని విరాట్ అంటున్నట్లు అనిపిస్తోంది.

ఈ వీడియోపై ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది 'భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇది విరుష్క మూమెంట్' అంటూ ఈ వీడియోను షేర్ చేస్తుంటే.. మరికొంతమంది 'పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ విరాట్ కోహ్లీ..' అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక విరాట్ భార్య అనుష్కతో పాటు రోహిత్ శర్మ భార్య రితిక కూడా స్టాండ్స్‌లో సందడి చేసింది. మ్యాచ్ ఆసాంతం అనుష్క, రితికలు పక్క పక్కనే కూర్చున్నారు. ఇద్దరూ వైట్ కలర్ డ్రెస్‌లో స్టాండ్స్‌లో సందడి చేశారు.

ఇదిలా ఉంటే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పెద్దగా రాణించలేకపోయాడు. గిల్ అవుటైన తర్వాత 3వ ఓవర్లో బ్యాటింగ్‌కి వచ్చిన విరాట్ ఇన్నింగ్స్ స్లోగా సాగింది. ఒకపక్క రోహిత్ సిక్స్‌ల వర్షం కురిపిస్తుంటే మరో పక్క కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేయసాగాడు. చివరికి 18 బంతుల్లో 16 పరుగులు చేసిన కోహ్లీ.. 10 ఓవర్లో హసన్ అలీ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడబోయి మిడ్ ఆన్‌లో మహమ్మద్ నవాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Story first published: Sunday, October 15, 2023, 15:45 [IST]
Other articles published on Oct 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+