మా బౌలింగ్ ఎటాక్ సూపర్: మాంచెస్టర్‌లో 270 భారీ స్కోరే

హైదరాబాద్: తక్కువ స్కోర్లు కాపాడుకోగలిగే సత్తా టీమిండియాకు ఉందని మరోసారి తాము నిరూపించామని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. టోర్నీలో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 224, వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో 268 స్కోర్లను కాపాడుకున్న సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బుమ్రా, షమీ అద్భుత ప్రదర్శన
ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. గురువారం విండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు.

బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు
"జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి బుమ్రా ఇదే ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఇక, మహ్మద్ షమీ ఆడింది రెండు మ్యాచులే అయినా అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం టీమిండియా మంచి ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని కలిగి ఉంది" అని కుల్దీప్ అన్నాడు.

మంచి స్పిన్నర్లు ఉన్నారు
"మంచి స్పిన్నర్లు కూడా ఉన్నారు. మేం కేవలం మంచి జట్టు కూర్పునే చూస్తున్నాం. మా బౌలర్లు సైతం ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్‌పై అద్భుతంగా దాడి చేస్తున్నారు. అదెంతో కీలకం. ఆప్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో మేం 225 పరుగుల్ని కాపాడుకున్నాం. విండీస్‌పై 250 చేస్తే చాలు అనుకున్న సమయంలో ధోనీ, హార్దిక్ మెరుగైన స్కోరు అందించారు" అని కుల్దీప్ తెలిపాడు.

మాంచెస్టర్ వికెట్‌పై 270 పరుగులు భారీ స్కోరే
"మాంచెస్టర్ వికెట్‌పై 270 పరుగులు భారీ స్కోరే. తొలి ఇన్నింగ్స్ తర్వాత బంతి కాస్త ఎక్కువగా టర్న్ అయింది. ఈ మ్యాచ్‌లో షమీ త్వరగా రెండు వికెట్లు తీయడం మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. ఈ మ్యాచ్‌లో నేనూ ఓ వికెట్ తీసినందుకు సంతృప్తిగా ఉంది" అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications