న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్‌, వార్నర్‌లకు చోటు.. ఆసీస్‌ ప్రపంచకప్‌ జట్టు ఇదే

World Cup 2019 Squad: Smith, Warner named in Australia Team

మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచకప్‌ కోసం ఒక్కొక్క దేశం తమ క్రికెట్ జట్టును ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మొదటగా న్యూజీలాండ్.. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ప్రకటించింది. ఇప్పుడు ఈ జాబితాలో ఆస్ట్రేలియా కూడా చేరిపోయింది.

కెప్టెన్‌గా అరోన్‌ ఫించ్‌:

కెప్టెన్‌గా అరోన్‌ ఫించ్‌:

మెగా టోర్నీ ప్రపంచకప్‌ 2019 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను క్రికెట్‌ ఆస్ట్రేలియా సెలక్టర్ల చైర్మన్‌ ట్రెవర్‌ హాన్స్‌ సోమవారం ప్రకటించారు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో చిక్కుకుని ఏడాది పాటు నిషేదానికి గురైన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌, డెవిడ్‌ వార్నర్‌లు జట్టులో చోటుదక్కించుకున్నారు. అయితే బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం కారణంగా స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌గా అనర్హుడు కాబట్టి.. అరోన్‌ ఫించ్‌నే కెప్టెన్‌గా కొనసాగించారు. ఆరోన్‌ ఫించ్‌, డేవిడ్‌వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌స్మిత్‌, షాన్‌ మార్ష్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అలెక్స్‌ కారెలు బ్యాటింగ్ విభాగంలో ఎంపికయ్యారు.

ఆడమ్‌ జంపాకు చోటు:

ఆడమ్‌ జంపాకు చోటు:

ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ కౌల్టర్‌ నీల్‌, రిచర్డ్సన్‌, జాసన్‌ బెహండ్రాఫ్‌లు పేస్ బాధ్యతలు మోయనున్నారు. వీరితో పాటు మార్కస్‌ స్టోయినిస్‌ కూడా ఉన్నాడు. ఇక సీనియర్ స్పిన్నర్ నాథన్ లియోన్ బదులుగా యువ స్పిన్నర్ ఆడమ్‌ జంపాను తీసుకున్నారు. అవసరమయితే జంపాతో పాటు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌లు స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.

సీనియర్ ఆటగాళ్లకు మొండిచెయ్యి:

సీనియర్ ఆటగాళ్లకు మొండిచెయ్యి:

ప్రపంచకప్‌ జట్టులో చోటు ఆశించిన సీనియర్‌ పేసర్ జోష్‌ హజల్‌వుడ్‌కు చుక్కెదురైంది. గాయం కారణంగానే హజల్‌వుడ్‌కు జట్టులో చోటు దక్కలేదని సమాచారం. ఇక వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ పీటర్‌ హ్యాండ్‌ స్కోంబ్‌లకు చోటు దక్కలేదు. దీంతో అలెక్స్‌ కారె వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యాడు.

జట్టు:

జట్టు:

ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌ స్మిత్‌, షాన్‌ మార్ష్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అలెక్స్‌ కారె (వికెట్‌ కీపర్‌), ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ కౌల్టర్‌ నీల్‌, రిచర్డ్సన్‌, జాసన్‌ బెహండ్రాఫ్‌, ఆడమ్‌ జంపా.

Story first published: Monday, April 15, 2019, 11:01 [IST]
Other articles published on Apr 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X