Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్‌పై పాక్ విజయం: నిజమైన మాజీ పేసర్ షోయబ్ అక్తర్ జోస్యం

World Cup 2019: Shoaib Akhtar’s old prediction on Pakistan beating England came true

హైదరాబాద్: వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో చెత్త బ్యాటింగ్‌తో 105 పరుగులకే పాకిస్థాన్ ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ చెత్త ఓటమితో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న పాకిస్థాన్... సోమవారం ఊహించని ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అటు బ్యాట్‌తో పాటు ఇటు బౌలింగ్‌లోనూ సమిష్టి ప్రదర్శన చేసి ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆతిథ్య జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మన్‌ సెంచరీలు సాధించినప్పటికీ ఇంగ్లాండ్‌ ఓడిపోయింది. అయితే, వరల్డ్‌కప్‌కు ముందే ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధిస్తుందని మే22న మాజీ పేసర్ షోయబ్ అక్తర్ జోస్యం చెప్పాడు. అక్తర్ చెప్పినట్టే సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ అనంతరం ఒక వీడియోని అక్తర్ తన సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు. "అవును పాక్ గెలిచింది. ఇంగ్లాండ్‌ను పాక్‌ ఓడిస్తుందని రెండు వారాల క్రితమే చెప్పాను. పాక్ మేలుకుంది. కెప్టెన్‌తో పాటు జట్టు కూడా మేలుకుంది" అని ఆ వీడియోలో షోయబ్ అక్తర్ చెప్పాడు. పాక్‌ గెలుస్తుందని అక్తర్‌ రెండు వారాల ముందు చెప్పాడని, దానికి తానే సాక్ష్యమని మాజీ వికెట్‌ కీపర్‌ రషీద్‌ లతీఫ్‌ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. అనంతరం 349 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆతిథ్య జట్టు 14 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Story first published: Tuesday, June 4, 2019, 19:29 [IST]
Other articles published on Jun 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+