
హైదరాబాద్: షెల్డన్ కాట్రెల్.. ఈ ప్రపంచకప్‌లో వికెట్ తీసిన తర్వాత సంబరాలను వినూత్నంగా జరుపుకుంటున్న ఆటగాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో షెల్డన్ కాట్రెల్ వికెట్ తీసిన వెంటనే సెల్యూట్ చేసి సంబరాలు చేసుకోవడాన్ని మనం చూశాం.
టోర్నీలో భాగంగా గురువారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన కాట్రెల్ ఎప్పటిలాగే ఆర్మీ సెల్యూట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ(72), ధోని(56)హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది.
అనంతరం టీమిండియా నిర్దేశించిన 269 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ ఇన్నింగ్స్‌లో షెల్టన్ కాట్రెల్ తొమ్మిదో వికెట్‌గా ఔటైన సందర్భంలో భారత పేసర్ మహ్మద్ షమీ అతన్ని అనుకరించాడు. విండీస్ లక్ష్య ఛేదనలో భాగంగా చాహల్ వేసిన 30 ఓవర్ ఐదో బంతికి కాట్రెల్ ఎల్బీగా ఔటయ్యాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆ సమయంలో కాట్రెల్ తరహాలోనే మార్చ్‌ఫాస్ట్ చేసిన షమీ సెల్యూట్ చేశాడు. దీనికి చాహల్‌తో సహా కోహ్లీ కూడా పగలబడి నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోని చూసిన కాట్రెల్ ట్విటర్ వేదికగా షమీ సెల్యూట్‌పై స్పందించాడు.
షమీ చేసిన సెల్యూట్‌ను తేలిగ్గా తీసుకున్న కాట్రెల్.. 'గ్రేట్ ఫన్.. గ్రేట్ బౌలింగ్' అంటూ ట్విట్టర్‌లో సమాధానమిచ్చాడు. వృత్తిరీత్యా సోల్జర్ అయిన కాట్రెల్.. జమైకా డిఫెన్స్ ఫోర్స్‌కు గౌరవ సూచకంగా వికెట్ తీసిన వెంటనే మార్చ్‌ఫాస్ట్ చేసి సెల్యూట్ చేస్తున్నాడు.
టీమిండియా నిర్దేశించిన 269 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు 34.2 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు మహ్మద్ షమీ, బుమ్రా, చాహల్ బౌలింగ్ ముందు కరీబియన్లు నిలవలేకపోయారు. ఏ దశలోనూ కోహ్లీసేనకు పోటీ ఇవ్వలేకపోయారు.
విండీస్ ఆటగాళ్లలో ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్(28), హెట్‌మెయిర్(18) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో షమీ నాలుగు... బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.
తాజా విజయంతో టీమిండియా సెమీస్‌కు చేరుకోగా, విండీస్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. తాజా విజయంతో భారత్ 11 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కోహ్లీ నిలిచాడు.