వీడియో వైరల్: ధోని స్టంపింగ్‌ను మిస్ చేసిన విండిస్ వికెట్‌కీపర్
ICC Cricket World Cup 2019 : MS Dhoni Survives As Shai Hope Misses Easy Stumping

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తడబడుతోంది. ఈ మ్యాచ్‌లో ధోని స్టంపౌట్ నుంచి తప్పించుకున్నాడు. విండీస్ వికెట్ కీపర్ షాయ్ హోప్ చెత్త కీపింగ్‌తో ధోని ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విండిస్ స్పిన్నర్ ఫబియాన్ అలెన్ వేసిన 34 ఓవర్ తొలి బంతిని ఆడేందుకు ధోని ముందుకొచ్చాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే బ్యాట్‌కు దూరంగా వెళ్లిన బంతి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. అయితే తొలి ప్రయత్నంలో ధోనిని స్టంపౌట్ చేయడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత ధోని క్రీజులో వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోప్‌కు మరో అవకాశం లభించినప్పటికీ స్టంపౌట్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో భారత అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం ధోని బంతిని ఆడేందుకు క్రీజుని వదిలి ముందుకు వెళ్లగా స్టంపౌట్ అయ్యాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ధోని ధోని 61 బంతుల్లో 56(3 పోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీ సాధించాడు.
{headtohead_cricket_3_8}
Story first published: Thursday, June 27, 2019, 19:23 [IST]
Other articles published on Jun 27, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications