భారత్ చేతిలో ఓటమిని మరిచిపోండి: పాక్ కెప్టెన్‌కు పీసీబీ నుంచి ఫోన్

హైదరాబాద్: గత ఆదివారం మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 89 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో పాక్ ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆ జట్టుపై పాక్ అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
భారత్ చేతిలో ఓటమి ప్రభావం పాకిస్థాన్ ఆడబోయే తదుపరి మ్యాచ్‌పై కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ చేతిలో ఎదురైన ఓటమిని మరిచిపోయి ప్రపంచకప్‌లోని మిగతా మ్యాచ్‌లపై దృష్టి సారించాలని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి వెల్లడించినట్లు పాక్ మీడియా పేర్కొంది.

సర్ఫరాజ్ అహ్మద్‌తో ఫోన్‌లో మాట్లాడిన పీసీబీ ఛైర్మన్
ఈ మేరకు పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పీసీబీ ఛైర్మన్ ఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలను ప్రచురించాయి. "దేశమంతా మీకు అండగా ఉంది. రాబోయే రోజుల్లో కలసికట్టుగా మెరుగైన ప్రదర్శనను ఇస్తారని ఆశిస్తున్నాం" అని ఆయన కెప్టెన్ సర్ఫరాజ్‌తో చెప్పినట్లు అందులో పేర్కొన్నాయి.

సోషల్ మీడియాలో వస్తోన్న వార్తా కథనాలపై
సోషల్ మీడియాలో వస్తోన్న వార్తా కథనాలను పట్టించుకోకుండా రానున్న మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించాలని చైర్మన్ ఎహ్సాన్ మణి సర్ఫరాజ్ అహ్మద్‌ను కోరినట్లు న్యూస్ ఎక్స్ తన కథనంలో పేర్కొంది. మాంఛెస్టర్ వేదికగా భారత్‌తో తలపడిన మ్యాచ్‌లో దారుణంగా పరాజయంపాలవ్వడం పాకిస్తాన్ క్రికెట్ జట్టులో భయాందోళనలను నింపింది.

ఒంటరిగా ఇంటికి వెళ్లొద్దని సర్ఫరాజ్ సూచన
భారత్ చేతిలో ఓటమి నేపథ్యంలో స్వదేశంలో అడుగు పెట్టిన తరువాత ఒంటరిగా ఇంటికి వెళ్లొద్దని సర్ఫరాజ్ అహ్మద్ తన జట్టు సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ కథనాన్ని పాకిస్తాన్‌కు చెందిన ఓ వెబ్‌సైట్ ప్రచురించింది. ఇంటికి వెళ్లేటప్పుడు గానీ, బయట తిరిగేటప్పుడు గానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని సర్ఫరాజ్ సూచించినట్లు పేర్కొంది.

23న లార్డ్స్‌లో సఫారీలతో మ్యాచ్
ఇదిలా ఉంటే, ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లాడిన పాక్ 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో నిలిచింది. టోర్నీలో భాగంగా జూన్ 23న తన తదుపరి మ్యాచ్‌లో లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications