
హైదరాబాద్: 1992 వరల్డ్‌కప్ గురించి ఆలోచించడం లేదని... అలా జరుగుతుందని తాను అనుకోవడం లేదని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన విజయం సాధించడంతో 1992 నాటి చరిత్ర పునరావృతం అవుతుందనే పాక్ అభిమానులు జోస్యం చెబుతున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో కివీస్ మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ మాట్లాడుతూ "1992 వరల్డ్‌కప్ గురించి ఆలోచించడం లేదు. అలా జరుగుతుందని అనుకోవడం లేదు. అలాగే జరగాలని కూడా ఏమీ లేదు. ఈ ప్రపంచకప్‌లో రాబోయే రోజుల్లో జరిగే ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమే. విజయాలు సాధిస్తూ ముందుకు సాగడమే మా లక్ష్యం" అని అన్నాడు.
"న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజామ్, హరీస్ సొహైల్ బ్యాటింగ్ అద్భుతం. నేను చూసిన బాబర్ ఇన్నింగ్స్‌ల్లో ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్. క్లిష్టమైన పిచ్‌పై బాబర్ సెంచరీ చేసి విజయంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. 50 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండాలనే తలంపుతోనే బ్యాటింగ్‌కు దిగాం" అని సర్ఫరాజ్ తెలిపాడు.
"ఈ మ్యాచ్ క్రెడిట్ అంతా బాబర్ ఆజాం, హరీస్‌లకే దక్కుతుంది. ఒత్తిడిని అధిగమిస్తూ వారు అద్ఫుత ప్రదర్శన చేశారు. ఊహించిన పేస్‌తో పాటు స్పిన్‌ను ఎదుర్కొంటూ వారిద్దరూ పరుగులు తీసిన తీరు నిజంగా అద్భుతం" అని సర్ఫరాజా ప్రశంసల వర్షం కురిపించాడు.
కాగా, 1992 వరల్డ్‌కప్‌లో కూడా పాకిస్థాన్ ఓడుతూ... గెలుస్తూ సెమీస్‌కు చేరింది. ఆ తర్వాత సెమీస్, పైనల్లో విజయాలను నమోదు చేసి చివరికి ప్రపంచకప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో ఆ చరిత్ర మళ్లీ పునరావృతం అవుతోందని మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్, జావెద్ మియాందాద్, రమీజ్ రజా అంటున్నారు.