Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెస్ట్ లేదు: వరల్డ్‌కప్ ముంగిట జిమ్‌లో చెమటోడ్చుతున్న పాండ్యా (వీడియో)

World Cup 2019: No rest days for Hardik Pandya as India all-rounder sweats it out at the gym

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడుతున్నాడు. తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. వరల్డ్‌కప్ నేపథ్యంలో ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ఆటగాళ్లను విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ సూచించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే టూర్లు ప్లాన్ చేసుకుని సేద తీరుతుంటే... హార్దిక్‌ పాండ్యా మాత్రం ఇందుకు భిన్నంగా జిమ్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

"వరల్డ్‌కప్ అతి సమీపంలోనే ఉండటంతో విశ్రాంతి తీసుకోవడం లేదు" అంటూ కామెంట్‌ను కూడా పోస్టు చేశాడు. 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్ షో వివాదం తర్వాత హార్దిక్‌ పాండ్యాలో చాలా మార్పు వచ్చిందని, ఐపీఎల్‌లో అతడి ఆటతీరుతో పాటు, ప్రవర్తనలో సైతం చాలా మార్పు వచ్చిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే, మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఇందుకోసం టీమిండియా మే22న ఇంగ్లాండ్‌ బయల్దేరి వెళ్తుంది. వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత టోర్నీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌‌ని దక్షిణాఫ్రికాతో ఆడనుంది. జూన్‌ 5న జరిగే ఈ మ్యాచ్‌‌కి సౌతాంప్టన్‌ వేదికగా కానుంది.

Story first published: Monday, May 20, 2019, 13:20 [IST]
Other articles published on May 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+