న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: లక్షకుపైగా టిక్కెట్లను కొనుగోలు చేసిన మహిళలు

World Cup 2019: More than one lakh women have bought World Cup tickets: ICC

హైదరాబాద్: మరో రెండు రోజ్లులో ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌ను ఆస్వాదించేందుకు ప్రతి ఒక్కరూ తహతహలాడుతున్నారు. ముఖ్యంగా ఈ వరల్డ్‌కప్‌ను వీక్షించేందుకు మహిళలు పెద్దఎత్తున ఆసక్తిని కనబరుస్తున్నారని టోర్నమెంట్ డైరెక్టర్‌ స్టీవ్‌ ఎల్‌వర్తీ చెప్పాడు. ఈ మెగా టోర్నీని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షకు పైగా మహిళలు టిక్కెట్లను కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనమన్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి

ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి

వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి.

వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ ఆతిథ్యం

వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ ఆతిథ్యం

జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీని చూసేందుకు ఫ్యాన్స్ బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రపంచకప్‌ చరిత్రలోనే తొలిసారిగా రెండు లక్షల మంది కొత్త వీక్షకులు టోర్నీని ప్రత్యక్షంగా తిలకించేందుకు రానున్నారని స్టీవ్‌ ఎల్‌వర్తీ తెలిపాడు.

ఈ టోర్నీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది

ఈ టోర్నీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది

"ఇంగ్లండ్‌లో జరగనున్న ఈ టోర్నీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 1,10,000 మంది మహిళా అభిమానులు టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఇందులో ఎక్కువలో ఎక్కువగా యువ అభిమానులే ఉన్నారు. దాదాపుగా 30 లక్షలకుపైగా టికెట్‌ దరఖాస్తులు అందాయి. 2 లక్షల మంది జనాలు మ్యాచ్‌ను చూడటానికి రావడం ఇది తొలిసారి" అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

కొన్ని మ్యాచ్‌లకైతే 4 లక్షల అప్లికేషన్లు

కొన్ని మ్యాచ్‌లకైతే 4 లక్షల అప్లికేషన్లు

"కొన్ని మ్యాచ్‌లకైతే 4 లక్షల అప్లికేషన్లు కూడా వచ్చాయి. అన్య శ్రుభ్‌సోల్ లాంటి క్రికెటర్ లార్డ్స్‌లో మ్యాచ్‌లు వీక్షించి ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో కీలక క్రికెటర్‌గా ఎదిగింది. శ్రుభ్‌సోల్ లాగా మరింత మంది క్రికెట్‌ను కెరీర్‌గా మలుచుకుని జాతీయ జట్టులోకి వస్తారని ఆశిస్తున్నాం. చాలా విషయాల్లో ఈ ప్రపంచకప్ మరిన్ని రికార్డులకు వేదికయ్యే అవకాశం కనిపిస్తోంది" అని ఎల్‌వర్తీ చెప్పారు.

Story first published: Tuesday, May 28, 2019, 11:50 [IST]
Other articles published on May 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X