కివీస్ Vs పాక్: ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు ఎందుకంత ముఖ్యం!

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం బర్మింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. పాకిస్థాన్ 2019 ప్రపంచకప్ క్యాంపెయిన్ అచ్చం 1992 ప్రపంచకప్ క్యాంపెయిన్‌ను పోలి ఉంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ రెండింట విజయం సాధించగా... ఒక మ్యాచ వర్షం కారణంగా రద్దు అయింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

1992 ప్రపంచకప్‌లో
1992 ప్రపంచకప్‌లో లీగ్ స్టేజిలో న్యూజిలాండ్ జట్టును ఓడించిన జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్థానే. ఈ ప్రపంచకప్‌లో కూడా న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు న్యూజిలాండ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... ఒక మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దు అయింది.

ఒక మ్యాచ్ విజయం దూరంలో
న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్స్ బెర్తుకు కేవలం ఒక మ్యాచ్ విజయం దూరంలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడితే న్యూజిలాండ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. కానీ, పాక్ పరిస్థితి అలా లేదు. ఆడిన ఆరు మ్యాచుల్లో రెండు గెలిచిన పాక్ మూడు ఓడింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్డయింది.

5 పాయింట్లతో ఏడో స్థానంలో
దీంతో పాక్ 5 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగతా మూడు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కివీస్‌తో మ్యాచ్ గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడితే ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లను బట్టి సెమీస్ అవకాశాలు ఉంటాయి.

ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ ఆలస్యం
కాగా, బర్మింగ్‌హామ్ మైదానంలో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ ఆలస్యంగా వేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టోర్నీలో న్యూజిలాండ్ 11 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరోవైప పాక్ ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications