ఆసీస్ Vs పాక్: ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరు: పైచేయి ఎవరిదో?

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో బుధవారం మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. టోర్నీలో భాగంగా అతిథ్య ఇంగ్లాండ్‌ను ఖంగు తినిపించి మంచి ఊపుమీద ఉన్న పాకిస్థాన్ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. విండిస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తడబడినా... ఆ తర్వాత ఆతిథ్య జట్టుపై గెలిచి పాక్ ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాక్ ఖాతాలో మూడు పాయింట్లు ఉన్నాయి. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీని ఘనంగా ఆరంభించినప్పటికీ, కోహ్లీసేన చేతిలో పరాజయంతో కాస్త నిరాశలో ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది.

బ్యాటింగే ప్రధాన బలంగా
ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటింగే ప్రధాన బలంగా బరిలోకి దిగుతున్నాయి. గత మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీలు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌తో పాటు కెప్టెన్ ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ రాణిస్తే తప్పక విజయం సాధిస్తుంది. పాక్‌పై మంచి రికార్డు ఉన్న మ్యాక్స్‌వెల్ దానిని మరింత మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నాడు.

బౌలింగ్ విషయానికి వస్తే
ఇక, బౌలింగ్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఆసీస్‌కు అదనపు బలం. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గాయపడ్డ మార్కస్ స్టాయినిస్ స్థానంలో ఈ మ్యాచ్‌కు షాన్ మార్ష్ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కౌల్టర్ నైల్, ఆడమ్ జంపాలకు బదులుగా రిచర్డ్సన్, లయాన్‌లను ఆడించనున్నారు.

పాకిస్థాన్ సైతం పలు మార్పులతో
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ సైతం పలు మార్పులతో బరిలోకి దిగనుంది. పాక్ పేసర్ హసన్ అలీ స్థానంలో ఇమాద్‌ను ఆడించాలని పాక్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. మరోవైపు వహాబ్ రియాజ్, షాహిన్‌లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కనుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.

పొంచి ఉన్న వర్షం ముప్పు
టాంటన్‌లో బుధ వారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మ్యాచ్ ఎలా సాగుతుందో చూడాలి. టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. ఆకాశం మేఘావృతమై.. వాన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ముఖాముఖి పోరు
ఆడిన మ్యాచ్‌లు - 9
ఆస్ట్రేలియా గెలిచినవి - 5
పాకిస్థాన్ గెలిచినవి - 4

జట్ల వివరాలు
ఆస్ట్రేలియా: వార్నర్, ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్, క్యారీ(వికెట్ కీపర్), నైల్, రిచర్డ్‌సన్, కమిన్స్, స్టార్క్, జంపా
పాకిస్థాన్: ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ ఆజామ్, హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్, అసిఫ్ అలీ, మాలిక్, వాహబ్ రియాజ్, హసన్ అలీ, షాదబ్ ఖాన్, ఆమీర్
మ్యాచ్ టైమింగ్స్ - మధ్యాహ్నాం 3 గంటలకు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications