తొలి మ్యాచ్‌లో సఫారీలపై ఘన విజయం: అందరి నోటా వారిద్దరే!

హైదరాబాద్: సొంతగడ్డపై వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. ఓవల్ వేదికగా గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్ విజయంలో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, పేసర్ జోఫ్రా ఆర్చర్ కీలకపాత్ర పోషించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 311 పరుగులు చేసింది. స్టోక్స్ 79 బంతుల్లో 89 (9 ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జేసన్ రాయ్ (54; 8 ఫోర్లు), రూట్ (51; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.

బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ (3/27), స్టోక్స్ (2/12), ప్లంకెట్ (2/37) రాణించారు. బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో వీరిద్దరి ప్రదర్శన గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఐపీఎల్ ముందు జరిగిన ఐపీఎల్ 12వ సీజన్‌లో బెన్ స్టోక్స్ ప్రదర్శన నిరాశపరిచింది.

ఐపీఎల్‌లో విఫలం... తొలి మ్యాచ్‌లో రెచ్చిపోయిన స్టోక్స్
కానీ, సఫారీలతో జరిగిన తొలి మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాక ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు. ఈ మెగా టోర్నీలో టైటిల్ ఫేవరేట్ జట్లలో ఇంగ్లాండ్ కూడా ఒకటి. ఆరంభ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 111/3తో కష్టాల్లో పడిన సమయంలో బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు.

79 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 89 పరుగులు
మొదట్లో నిలకడగా ఆడిన బెన్ స్టోక్స్ ఆ తర్వాత దూకుడుగా ఆడి 79 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. స్టోక్స్ దూకుడుగా ఆడటంతోనే ఇంగ్లాండ్ 300పైచిలుకు పరుగులను అందుకుంది. ఇక, బౌలింగ్‌లో 2.5 ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక, ఈ మ్యాచ్‌లో ఫెలుక్వాయో క్యాచ్‌ని కళ్లు చెదిరే విధంగా స్టోక్స్ అందుకున్నాడు.

చెలరేగిన జోఫ్రా ఆర్చర్
మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. మంచి వేగం, లైన్ అండ్ లెంగ్త్ అతడి సొంతం. నిజానికి ఈ వరల్డ్‌కప్ కోసం ముందుగా ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టులో జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదు. వరల్డ్‌కప్‌కు ముందే అతడిని సెలక్టర్లు పరగణనలోకి తీసుకున్నారు.

27 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు
వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ఆడటానికి ముందు జోఫ్రా ఆర్చర్ కేవలం మూడు అంతర్జాతీయ వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే, అతడి ఫామ్‌ని చూసి సెలక్టర్లు వరల్డ్‌కప్ ఆరంభం కావడానికి వారం రోజుల ముందు డేవిడ్ విల్లీ స్థానంలో జట్టులోకి ఎంపిక చేశారు. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లలో మెయిడెన్ సహా 27 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications