ఇంగ్లాండ్ చేతిలో ఓటమికి కారణమిదే!

హైదరాబాద్: ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 119 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కనీసం పోరాడకుండా చేతులెత్తేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ "ఈ పిచ్‌పై పరుగులు చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ పిచ్ మొత్తం బౌలింగ్‌కే అనుకూలించింది. కానీ మేం పోరాట స్ఫూర్తి ప్రదర్శించడంలో కూడా విఫలమయ్యాం. ఒక భారీ భాగస్వామ్యం నమోదైతే విజయం సాధించేవాళ్లం" అని అన్నాడు.
"అలా చేయడంలో సఫలం కాలేకపోయాం. మా బ్యాటింగ్ వైఫల్యంతోనే ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు బెయిర్ స్టో, జేసన్ రాయ్‌లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. వారు సహజసిద్ధమైన బ్యాటింగ్‌తో పరుగులు సాధిస్తూ మాపై ఒత్తిడి పెంచారు" అని కేన్ విలియమ్సన్ అన్నాడు.
"ఇంగ్లాండ్ బ్యాటింగ్ అర్ధభాగం పూర్తయ్యే సరికి వికెట్ పూర్తిగా మారిపోయింది. దీంతో ఇంగ్లాండ్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాం. ఏది ఏమైనప్పటికీ ఈ మ్యాచ్‌లో మా పూర్తి స్థాయి ప్రదర్శన చేయలేకపోయాం" అని కేన్ విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications