సూపర్ ఓవర్ ఉత్కంఠను తట్టుకోలేక జేమ్స్ నీషమ్ చిన్ననాటి కోచ్ మృతి

హైదరాబాద్: ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నరాలుతెగే ఉత్కంఠను తట్టుకోలేక న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ చిన్ననాటి కోచ్ డేవిడ్ జేమ్స్ గోర్డాన్ కన్నుమూశాడు. ఈ విషయాన్ని జేమ్స్ గోర్డాన్ కుమార్తె లియోనీ స్వయంగా వెల్లడించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఓ న్యూజిలాండ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ "సూపర్ ఓవర్ జరుగుతున్న సమయంలో నర్స్ నా వద్దకు వచ్చి మీ త్రండిగారి శ్వాసలో మార్పు వచ్చింది" అని తెలిపిందని అన్నారు. "నాకు తెలిసి సూపర్ ఓవర్‌లో జేమ్స్ నీషమ్ రెండో బంతికి బాదిన సిక్స్‌తో ఆయన తుది శ్వాసను తీసుకున్నాడని భావిస్తున్నా" అని ఆమె చెప్పారు.

చిన్నతనంలో కోచ్‌గా
అక్లాండ్ గ్రామర్ స్కూల్ మాజీ టీచర్ అయిన డేవిడ్ జేమ్స్ గోర్డాన్ జేమ్స్ నీషమ్‌కు చిన్నతనంలో కోచ్‌గా వ్యవహారించారు. తన చిన్ననాటి కోచ్ కన్నుమూశాడన్న వార్త తెలిసిన జేమ్స్ నీషమ్ ట్విట్టర్‌లో స్పందించాడు. "డేవ్ గోర్డాన్ నా హైస్కూల్ టీచర్ మాత్రమే కాదు. కోచ్, స్నేహితుడు కూడా. ఆట పట్ల మీకున్న ప్రేమ అద్భుతం" అని అన్నాడు.

నా అదృష్టం
"మీ కోచింగ్‌లో ఆడటం నా అదృష్టం. మ్యాచ్ తర్వాత మీరు అభినందించిన తీరు ఇప్పటికీ గుర్తు. నన్ను చూసి మీరు గర్వించారని భావిస్తున్నా. ప్రతిదానికి ధన్యవాదాలు. RIP" అంటూ జేమ్స్ నీషమ్ ట్వీట్ చేశాడు. నీషమ్‌ను తన తండ్రి ఎంతగానో అభిమానించేవారని లియోనీ పేర్కొన్నారు. ఆక్లాండ్ గ్రామర్ స్కూల్‌లో 25 ఏళ్లుపైగా టీచర్‌గా పనిచేసిన డేవిడ్ జేమ్స్ గొర్డాన్ ఎంతో మంది విద్యార్థులకు క్రికెట్, హాకీ నేర్పించారు. నీషమ్, ఫెర్గూసన్‌లతో పాటు చాలా మంది హైస్కూల్ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చారు.

విశ్వవిజేతగా ఇంగ్లాండ్
లార్డ్స్ వేదికగా జులై 14న ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

సూపర్ ఓవర్‌లో కూడా మ్యాచ్ టై
ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications