IND vs AUS: పలు రికార్డును బద్దలు కొట్టిన ధావన్-రోహిత్ జోడీ

హైదరాబాద్: పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా తరుపున శిఖర్ ధావన్-రోహిత్ శర్మలు అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడి అనడంలో ఎలాంటి సందేహాం లేదు. వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే స్పష్టమైంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు. తొలి ఏడు ఓవర్ల నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు... ఆ తర్వాత ధావన్ పరుగుల వరద పారించాడు. కౌల్టర్ నైల్ వేసిన ఎనిమిదో ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టి ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఓవర్లు ధావన్ 14 పరుగులు పిండుకున్నాడు.
ఆ తర్వాత నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరొవైపు రోహిత్ శర్మ అతడికి సహకారం అందిస్తు హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరి జోడీ 127 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రోహిత్ శర్మ(57) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
నిజానికి ఐసీసీ టోర్నీలంచే చాలా ధావన్ ఆట తీరే పూర్తిగా మారిపోతుంది. అంతకముందు వరకు ఫామ్‌లో లేకున్నా ఐసీసీ టోర్నీల్లో మాత్రం అనూహ్యంగా చెలరేగిపోతాడఉ. 2015 వరల్డ్‌కప్‌తో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీల్లో సైతం ధావన్ చెలరేగి ఆడాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో సఫారీలతో జరిగిన తొలి మ్యాచ్‌లో నిరాశ పరిచిన శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లోఅద్భుత సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఐసీసీ టోర్నీల్లో ధావన్‌కి ఇది 6వ సెంచరీ.
ఐసీసీ నిర్వహించే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ లాంటి టోర్నీల్లో ఇప్పటివరకు మొత్తం 20 మ్యాచ్‌లాడిన ధావన్ 65.15 యావరేజితో 1238 పరుగులు చేశాడు. కాగా, ఆదివారం నాటి మ్యాచ్‌లో శిఖర్ ధావన్-రోహిత్ శర్మలు తొలి వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో అనేక రికార్డులు నెలకొల్పారు. అవేంటో ఒక్కసారి చూద్దాం...

ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు నమోదు చేసిన ఓపెనర్లు
- 1273 - రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ (ఇండియా)
- 1152 - గోర్డాన్ గ్రీన్ఇడ్జ్-దేశమొండ్ హేయాన్స్ (వెస్టిండిస్)
- 1079 - మహిళా జయవర్దనే-కుమార సంగక్కర (శ్రీలంక)

అత్యధిక సెంచరీల భాగస్వామ్యం
వన్డేల్లో భారత తరుపున అత్యధిక సెంచరీల భాగస్వామ్యం చేసిన జోడీగా సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ(21) అగ్రస్థానంలో ఉంది. ఈ రికార్డుని అందుకునేందుకు శిఖర్ ధావన్-రోహిత్ శర్మల జోడీ ఆరు ఇన్నింగ్స్‌ల దూరంలో నిలిచారు.

ఆరో సెంచరీ భాగస్వామ్యం
ఐసీసీ టోర్నీల్లో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ జోడీకి ఇది ఆరో సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం. ఆస్ట్రేలియా ఆటగాళ్లు గిల్‌క్రిస్ట్-మ్యాథ్యూ హెడెన్‌లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.

ఐసీసీ టోర్నీల్లో ధావన్ సెంచరీల సంఖ్య 6
ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీల సంఖ్య. సచిన్, గంగూలీ చెరో 7 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. పాంటింగ్ , సంగక్కరతో కలిసి ధావన్ రెండో స్థానంలో నిలిచాడు.

అత్యధిక సెంచరీలు
ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా భారత్ అగ్రస్థానానికి చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ సెంచరీతో టీమిండియా బ్యాట్స్‌మెన్ సెంచరీల సంఖ్య 27కు చేరింది. ఆస్ట్రేలియా (26 సెంచరీలు) రెండో స్థానంలో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications