Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ ట్వీట్: బెస్ట్ ఓపెనింగ్ పెయిర్ ఎవరో చెప్పండి?

World Cup 2019: ICC asks fans to pick the best opening pair

హైదరాబాద్: అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు సర్వం సిద్ధమైంది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999).

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ కావడంతో ఆతిథ్య జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం వన్డే ర్యాంకుల్లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది.

మే30 నుంచి జులై 14వరకు

మే30 నుంచి జులై 14వరకు

మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

ఐసీసీ ట్వీట్

వరల్డ్‌కప్ ఫ్రారంభం కానున్న నేపథ్యంలో అభిమానుల్లో ఆసక్తిని పెంచేందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పలురకాల ఈవెంట్లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఐసీసీ తన ట్విట్టర్‌లో "వరల్డ్‌కప్‌లో బెస్ట్ ఓపెనింగ్ పెయిర్ ఉన్న జట్టు ఏది?" అంటూ ట్వీట్ చేసింది.

రోహిత్, శిఖర్ ధావన్‌లే

రోహిత్, శిఖర్ ధావన్‌లే

ఐసీసీ ట్వీట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భారత్‌కు చెందిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు అత్యుత్తమ ఓపెనింగ్ పెయిర్ అంటూ ఐసీసీ ట్వీట్‌కు రీట్వీట్ చేస్తూ సమాధానమిస్తున్నారు. కాగా, ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ పెయిర్‌గా ధావన్, రోహిత్ శర్మ కొనసాగుతున్నారు.

2011 నుంచి ఓపెనర్లుగా

2011 నుంచి ఓపెనర్లుగా

2011 నుంచి వీరిద్దరూ భారత్ తరుపున ఓపెనర్లుగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 44.96 యావరేజితో 4586 పరుగులు చేశారు. దీంతో పాటు 15 సెంచరీ భాగస్వామ్యాలతో పాటు 13 హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలను నెలకొల్పారు. ఐసీసీ టోర్నీల్లో వీరిద్దరూ మెరుగైన రికార్డుని కలిగి ఉన్నారు.

Story first published: Thursday, May 16, 2019, 17:08 [IST]
Other articles published on May 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+