పాక్ జట్టులో విభేదాలే భారత్ చేతిలో ఓటమికి కారణమయ్యాయా?

హైదరాబాద్: ఆదివారం మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడటంపై ఆ దేశంలో విమర్శలు వెల్లువెతుతున్నాయి. జట్టులో విభేదాలు, కెప్టెన్‌తో సత్సంబంధాలు లేకపోవడమే ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాక్ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలని అక్కడి మీడియా పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాక్ ఓటమిని జీర్ణించుకోలేని పాక్ మీడియా పలు కథనాలను ప్రచురించింది. జట్టులో కొందరు ఆటగాళ్లు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారని.. వారిలో సానుకూల ధోరణే కనిపించలేదని అందులో పేర్కొన్నాయి. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడాన్ని కూడా తప్పుబట్టింది.

ఓటమి అనంతరం
ఆదివారంనాటి మ్యాచ్‌లో ఓటమి అనంతరం కెప్టెన్ సర్ఫరాజ్ డ్రెస్సింగ్ రూంలో తన అసహనాన్ని ప్రదర్శిస్తూ ఇమద్ వాసిం, ఇమాముల్ హక్ తనతో సహకరించడం లేదని, పరాజయానికి వారే కారణమని పేర్కొన్నట్టు సామ వార్తా చానల్ పేర్కొన్నది. మరో స్థానిక ఛానెల్ పాక్ జట్టులో గ్రూపులు ఉన్నాయని పేర్కొంటూ కథనాన్ని ప్రసారం చేసింది.

జట్టులో విభేదాలు
జట్టులో విభేదాలు లేవని, భారత్ చేతిలో పరాజయం తర్వాత జట్టులోని ఆటగాళ్లంతా నిరాశలో ఉన్నారని ఒక ఆటగాడు పేర్కొన్నాడు. ఇక, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ జట్టులో సమస్యలు ఉన్నాయని కొందరు ఆటగాళ్లు తనతో చెప్పారని ఆ సమస్యపై దృష్టి సారించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు హితబోధ చేశాడు.

సరైన ప్రణాళికే లేదు
మరోవైపు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ పాక్ ఓటమిపై "జట్టు ఎంపిక బాగా లేదు. సరైన ప్రణాళికే లేదు. ఆటలో గెలుపోటములు సహజం. కానీ పోరాడకుండానే తలొగ్గడం దారుణం" అని అన్నాడు. జట్టు విఫలమైనపుడు జట్టులో సమస్యలపై వదంతులు రావడం సహజమేనని, వాటిని పట్టించుకోనవసరం లేదని మొయిన్ తెలిపాడు.

పాక్ ఆటగాళ్లు బయటికెళ్లినట్లు
కాగా, టీమిండియాతో మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి పాక్ ఆటగాళ్లు బయటికి వెళ్లి డిన్నర్ చేసినట్లు వస్తోన్న వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఖండించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వస్తోన్న వీడియోలు పాతవని, శనివారం ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితం అయ్యారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications