ఆస్ట్రేలియాతో మ్యాచ్: తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లాండ్, సచిన్ సైతం ఇలా!

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగుతుందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. టోర్నీలో భాగంగా మంగళవారం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మెగా టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ తర్వాత ఈ మ్యాచ్‌నే బిగ్గెస్ట్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ ప్రపంచక్ తర్వాత ఈ రెండు జట్లు యాషెస్ సిరిస్‌లో తలపడనున్నాయి. యాషెస్ సిరిస్‌కు ముందు జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌పై అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. టైటిల్ ఫేవరేట్ జట్లలో ఇంగ్లాండ్ కూడా ఒకటి. అయితే, పాకిస్థాన్, శ్రీలంక జట్ల చేతిలో ఓటమి ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలను దెబ్బతీసింది.

ఇంగ్లాండ్‌కు ప్రతిష్టాత్మకం
దీంతో లార్డ్స్ ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్ ఇంగ్లాండ్‌కు ప్రతిష్టాత్మకం కానుంది. ఈ మ్యాచ్‌లో గనుక ఇంగ్లాండ్ ఓడితే సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారతాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 8 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండా నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

ఇంగ్లాండ్ గట్టి పోటీ
మరోవైపు బంగ్లాదేశ్(7 మ్యాచ్‌ల్లో 7 పాయింట్లు), శ్రీలంక(6 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లు), పాకిస్థాన్(6 మ్యాచ్‌ల్లో 5 పాయింట్లు) ఇంగ్లాండ్ జట్టుకు గట్టి పోటీనిచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో సచిన్ మంగళవారం ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ "ఇంగ్లాండ్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది" అని తెలిపాడు.

ఆసీస్ వరుస విజయాలు
"ఆస్ట్రేలియా జట్టు ఆడిన తీరుని చూస్తే, వరుసగా విజయాలను నమోదు చేసింది. ఇదే ఇంగ్లాండ్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. అయితే, ప్రస్తుతం ఆసీస్ బౌలింగ్ ఎటాక్ అంత గొప్పగా లేదు. మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ తర్వాత ఆసీస్ బౌలింగ్‍లో ఏదో మిస్సైంది. ఇక్కడే ఇంగ్లాండే అందిపుచ్చుకోవాలి" అని సచిన్ అన్నాడు.

అత్యుత్తమ జట్లలో ఇంగ్లాండ్ ఒకటి
"గత నాలుగేళ్లుగా ఇంగ్లాండ్ ఎలా ఆడిందో మనకు తెలుసు. ప్రపంచంలో అత్యుత్తమ జట్లలో ఒకటి. ఆ జట్టుని చూస్తే... గత వారంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు" అని సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ఈ ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్ జూన్ 30న తన తదుపరి మ్యాచ్‌లో టీమిండియాతో... జులై 3న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications