వర్షంతో నిలిచిన మ్యాచ్: ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలతో సందడి చేసిన గేల్

హైదరాబాద్: వరల్డ్‌కప్ మెగా టోర్నీకి ముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఆదివారం దక్షిణాఫ్రికా-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. కేవలం 12.4 ఓవర్లపాటు సాగింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

31 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
ఆ తర్వాత వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ని 31 ఓవర్లకు కుదించారు. మళ్లీ వరుణుడు ఆటకు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ని నిలిపివేశారు. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి దక్షిణాఫ్రికా 12.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ఆమ్లా (51 నాటౌట్), డికాక్ (37 నాటౌట్) పరుగులతో ఉన్నారు.
31 ఓవర్లకు
మ్యాచ్ మధ్యలో చిన్నపాటి చిరుజల్లులు పడుతున్న సమయంలో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లకుండా అభిమానులతో కలిసి సందడి చేశాడు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు గేల్‌తో ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఎగబడతారు. గేల్ సైతం అభిమానులతో సెల్ఫీలు దిగాడు.

క్రిస్‌గేల్‌కు ఇదే చివరి వరల్డ్‌కప్
కాగా, క్రిస్‌గేల్‌కు ఇదే చివరి వరల్డ్‌కప్ అని అంతా భావిస్తున్నారు. మరోవైపు కార్ఢిప్ వేదికగా బంగ్లాదేశ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దైంది. పాకిస్థాన్‌కు ఇది రెండో వార్మప్ మ్యాచ్. అంతకముందు ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications