For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌ జట్టుకు ఊహించని అతిథి నుంచి అరుదైన బహుమతి

World Cup 2019: Champions England receive unexpected gift from WWE COO Triple H

హైదరాబాద్: తొలిసారి క్రికెట్ ఛాంపియన్‌గా అవతరించిన ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు డబ్ల్యుడబ్ల్యుఈ స్టార్‌ ట్రిపుల్‌ హెచ్‌ అరుదైన బహుమతిని అందజేశాడు. జులై 14న లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత ఇరు జట్ల ప్రధాన స్కోర్లు సమమయ్యాయి.

దీంతో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్‌లో కూడా స్కోర్లు సమం కావడంతో బౌండరీ రూల్ ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ను నెగ్గడం ఇది తొలిసారి. దీంతో డబ్ల్యుడబ్ల్యుఈ స్టార్‌ ట్రిపుల్‌ హెచ్‌ తన ప్రపంచ ఛాంపియన్‌ బెల్ట్‌ను ఇంగ్లాండ్‌ జట్టుకు అంకితం చేశాడు.

ఈ మేరకు ట్విటర్‌‌లో "ఇదో అత్యద్భుతమైన టోర్నీ, చూడచక్కని ఫైనల్‌ మ్యాచ్‌. ఛాంపియన్‌గా అవతరించడానికి అన్ని అర్హతలు కలిగిన జట్టు. ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు అభినందనలు. ఈ సందర్భంగా డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచ ఛాంపియన్‌ బెల్ట్‌ మీకోసమే" అని ట్వీట్‌ చేశాడు.

Story first published: Saturday, July 20, 2019, 15:43 [IST]
Other articles published on Jul 20, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+