వెల్లువెత్తిన విమర్శలు: ప్యాన్స్‌ను ఆకట్టుకోని వరల్డ్‌కప్ ప్రారంభ వేడుకలు

హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్‌కు బుధవారం తెరలేచింది. బకింగ్‌హామ్ ప్యాలెస్ దగ్గరలోని ప్రఖ్యాత మాల్ రోడ్డులో వరల్డ్‌కప్ ప్రారంభ వేడుకలను ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా నిర్వహించింది. అయితే ఈ వరల్డ్‌కప్ ఆరంభ వేడుకలు ఆశించిన గ్రాండ్‌గా లేవని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఒలింపిక్స్, పుట్‌బాల్ వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలతో పోలుస్తూ 12వ ఎడిషన్ ఆరంభ వేడుకలు నిరాశపరిచాయని అంటున్నారు. చివరగా 1999లో ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్‌కప్ ఆరంభ వేడుకలతో బుధవారం జరిగిన ప్రారంభ వేడుకలను పోల్చిచూస్తే పెద్దగా ఆకట్టుకోలేదని మండిపడుతున్నారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ ప్రారంభ వేడుకలకు అభిమానులు వేలాదిగా తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది.

ఊహించిన స్థాయిలో ప్రారంభ వేడుకలు
అయితే, అభిమానులు ఊహించిన స్థాయిలో ప్రారంభ వేడుకలు జరగపోవడంతో నిరాశచెందారు. ఇంగ్లాండ్ స్థాయికి తగ్గట్లు ప్రారంభ వేడుకలను నిర్వహించడంలో విఫలమైందంటూ విమర్శించారు. అయితే, ఈ కార్యక్రమానికి కెప్టెన్లు హాజరుకారని ముందుగా ప్రకటించిన ఐసీసీ ఆభిమానులకు మాత్రం సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.

పది జట్ల కెప్టెన్లను వ్యాఖ్యాతలు ఒక్కొక్కరిగా
ఈ మెగా టోర్నీలో పాల్గొనే పది జట్ల కెప్టెన్లను వ్యాఖ్యాతలు ఒక్కొక్కరిగా వేదికపైకి ఆహ్వానించారు. దీనిని ముందుగా ఉహించని అభిమానులకు ఇదొక పెద్ద సర్‌ప్రైజ్ లాగా అనిపించింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌ను అనుసరించి ఆఫ్ఘనిస్థాన్‌తో మొదలుపెట్టి చివర్లో విరాట్ కోహ్లీ, ఆతిథ్య జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్టేజ్‌పైకి వచ్చారు.

60 సెకన్ల చాలెంజ్
ఈ సందర్బంగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌తో హోస్ట్‌గా వ్యవహారించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ ముచ్చటించాడు. ఆ తర్వాత 60 సెకన్ల చాలెంజ్‌లో భాగంగా పది జట్లకు సంబంధించిన మాజీ ఆటగాళ్లు, సెలెబ్రిటీలు బ్యాటింగ్‌తో అలరించారు.

వరల్డ్‌కప్-2019 సాంగ్ ‘స్టాండ్ బై'ను వేదికపై
వెస్టిండీస్ నుంచి వివ్ రిచర్డ్స్, స్ర్పింటర్ యొహాన్ బ్లేక్, భారత్ నుంచి అనిల్ కుంబ్లే, నటుడు ఫర్హాన్ అక్తర్, పాకిస్థాన్ ప్రతినిధిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌తో పాటు అజర్ అలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక, బంగ్లాదేశ్ నుంచి నటి జయ ఎహసాన్ పాల్గొన్నారు. ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రపంచకప్ ట్రోఫీని వేదికపై తీసుకువచ్చాడు. చివరగా వరల్డ్‌కప్-2019 సాంగ్ ‘స్టాండ్ బై'ను వేదికపై ఆలపించడంతో ఆరంభ వేడుకలు ముగిశాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications