For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేనను ఓడించే సత్తా బంగ్లాకు ఉంది: ఆఫ్ఘన్ విజయం తర్వాత షకీబ్

ICC Cricket World Cup 2019 : Shakib Says 'Bangladesh Will Give Their Best Shot Against India'
World Cup 2019: Bangladesh will give their best shot against India, says Shakib after Afghanistan win

హైదరాబాద్: టీమిండియాను ఓడించే సత్తా తమకు ఉందని బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ ఉల్ హాసన్ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం షకీబ్‌ అల్‌ హసన్‌ మీడియాతో మాట్లాడాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టీమిండియాతో జరిగే మ్యాచ్‌ ఎంతో ముఖ్యం

టీమిండియాతో జరిగే మ్యాచ్‌ ఎంతో ముఖ్యం

"టీమిండియాతో జరిగే మ్యాచ్‌ ఎంతో ముఖ్యం. టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. కానీ మేం గట్టి పోటీనిస్తాం. భారత్‌ జట్టులో అగ్రశ్రేణి ఆటగాళ్లున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా వారికుంది. మేం మా సాయశక్తుల పోరాడుతాం. భారత్‌ను ఓడించే సత్తా మాకు ఉంది" అని షకీబ్ అన్నాడు.

షకీబ్ హాఫ్ సెంచరీ

షకీబ్ హాఫ్ సెంచరీ

ఈ మ్యాచ్‌లో షకీబ్ ఉల్ హాసన్ హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఒక ప్రపంచకప్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు పది వికెట్లు కూడా తీసిన తొలి ప్లేయర్‌గా షకీబ్‌ అరుదైన ఘనత సాధించాడు. దీంతో పాటు ప్రపంచకప్‌లో 1000 పరుగులు చేసిన తొలి బంగ్లా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

రెండో స్పిన్నర్‌గా అరుదైన గుర్తింపు

రెండో స్పిన్నర్‌గా అరుదైన గుర్తింపు

ఇక, ప్రపంచకప్‌ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతోపాటు ఐదు వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా గుర్తింపు పొందాడు. 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (5/31; 50 నాటౌట్‌) ఈ ఘనత సాధించాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ప్రపంచకప్‌లో షకీబ్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి 476 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు.

జులై 2న టీమిండియాతో మ్యాచ్

జులై 2న టీమిండియాతో మ్యాచ్

టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ తన తదుపరి మ్యాచ్‌ల్లో భారత్‌, పాకిస్తాన్‌లతో ఆడనుంది. జూలై 2న భారత్‌తో తలపడనుంది. దాదాపు వారంకు పైగా ఆ జట్టుకు విశ్రాంతి లభించడంతో సరైన ప్రణాళికలతో బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

Story first published: Tuesday, June 25, 2019, 12:14 [IST]
Other articles published on Jun 25, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+