Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నన్ను తప్పించేందుకు పెద్ద కుట్ర చేశారు: ఆప్ఘన్ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు

ICC Cricket World Cup 2019 : Shahzad Blames ACB For His Withdrawl From CWC'19 Squad || Oneindia
World Cup 2019: Afghanistan cricket board conspired against me, says Mohammad Shahzad

హైదరాబాద్: మోకాలి గాయం కారణంగా ఆప్ఘనిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ మహ్మద్‌ షాజాద్‌ ఐసీసీ వరల్డ్‌‌కప్ టోర్నీ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. అయితే, తాను ఈ మెగా టోర్నీలో ఆడకుండా ఆప్ఘన్ క్రికెట్‌ బోర్డు కుట్ర పన్నిందని మహ్మద్‌ షెహజాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తాను ఫిట్‌గా ఉన్నప్పటికీ అర్థాంతరంగా జట్టు నుంచి తొలగించారంటూ ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డుపై మండిపడ్డాడు. ఈ సందర్భంగా షెహజాద్ మాట్లాడుతూ "నన్ను ఎందుకు తొలగించారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. నేను ఫిట్‌గా ఉన్నప్పటికీ.. ఫిట్‌నెస్‌ సాకుతో నన్ను జట్టు నుంచి తప్పించారు" అని పేర్కొన్నాడు.

కొంతమంది కలిసి నాపై కుట్ర పన్నారు

కొంతమంది కలిసి నాపై కుట్ర పన్నారు

"బోర్డులో కొంతమంది కలిసి నాపై కుట్ర పన్నారు. నా స్థానంలో వేరొకరిని జట్టులోకి తీసుకోనున్నారంటూ జట్టు మేనేజర్‌, డాక్టర్‌, కెప్టెన్‌కు ముందుగానే తెలుసు. ఆఫ్ఘన్ జట్టు కోచ్ (ఫిల్ సిమ్మన్స్)కు సైతం మ్యాచ్ తర్వాత తెలిసింది. ఇది నన్ను తీవ్రంగా కలిచి వేసింది" అని షెహజాద్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

మా కోచ్‌ కూడా తెలియదు

మా కోచ్‌ కూడా తెలియదు

"మా కోచ్‌ కూడా నన్ను తప్పించిన విషయం తర్వాత కానీ తెలియలేదు. న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు ముందు ట్రైనింగ్ ముగించుకుని నా ఫోన్ చెక్ చేసుకున్నా. మోకాలి గాయమంటూ చెప్పి మొత్తం టోర్నీ నుంచి తొలగించారు. టీమ్ బస్సులో ఉన్న ఆటగాళ్ల ఎవ్వరికీ కూడా నన్ను తప్పించిన విషయం తెలియదు. ఈ వార్త విని వారంతా షాక్‌ అయ్యారు" అని షెహజాద్‌ తెలిపాడు.

ఫిట్‌నెస్‌ లేదంటూ షెహజాద్‌ను

ఫిట్‌నెస్‌ లేదంటూ షెహజాద్‌ను

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఫిట్‌నెస్‌ లేదంటూ షెహజాద్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యువ క్రికెటర్‌ ఇక్రమ్ అలీ ఖిల్‌ను ఆప్ఘన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ తరుపున మహ్మద్‌ షాజాద్‌ కీలక పాత్ర పోషిస్తాడని అంతా భావించారు.

ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా

ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా

టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో మహ్మద్‌ షాజాద్‌ డకౌట్‌గా వెనుదిరగగా... ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 7 పరుగులు చేశాడు. 2015 వరల్డ్ కప్ నుంచి ఆప్ఘన్ జట్టులో ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్న షాజాద్‌ 55 మ్యాచ్‌ల్లో 1843 పరుగులు చేశాడు.

Story first published: Tuesday, June 11, 2019, 12:07 [IST]
Other articles published on Jun 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+