వరల్డ్‌కప్ 2019: 16 ఏళ్ల సచిన్ రికార్డుని బద్దలు కొట్టే ఆ ఐదుగురు ఎవరు?

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌లో క్రికెట్ అభిమానులు 500 పరుగుల స్కోరుని చూడబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. వన్డేల్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక జట్టు స్కోరు 481. ఈ స్కోరు నమోదైంది ఐదోసారి వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తోన్న ఇంగ్లాండ్‌లోనే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఇంగ్లాండ్ పిచ్‌లు బ్యాటింగ్ స్వర్గధామాలు. ఈ మెగా టోర్నీలో క్రికెట్ ప్రేక్షకులను అలరించేందుకు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా పిచ్‌లను రూపొందించారని సమాచారం. దీంతో ఈ టోర్నీలో పరుగుల వరద పారడం ఖాయం. ఇంగ్లాండ్‌లో ఏ మైదానంలో క్రికెట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఫ్యాన్స్‌కు అధికారిక స్కోర్ కార్డులు అమ్మడం ఆనవాయితీ.
ఇప్పటివరకు 400 స్కోర్లకు తగ్గట్లుగా ఆ కార్డులుండేవి. అయితే, ఈసారి ఇంగ్లాండ్ స్టేడియాల్లో మ్యాచ్‌లు ముగిసిన తర్వాత అభిమానులకు అమ్మే స్కోరు కార్డుల్ని '500' మార్కుకు తగ్గట్లుగా రీడిజైన్ చేయించింది. ఇంగ్లాండ్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 3 వికెట్లకు 373 పరుగులు చేయగా... లక్ష్యచేధనలో పాక్ 361 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2015 వన్డే వరల్డ్‌కప్ అనంతరం ఐదుసార్లు 400 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఈసారి 500 పరుగుల మార్కుని అందుకునేలా కనిపిస్తోంది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన బ్రిస్టల్ స్టేడియంలో 500 పరుగుల అందుకుంటారమో చూడాలి.
మరోవైపు వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డు ఈ టోర్నీలో బద్దలవుతుందో లేదో చూడాలి. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ టెండూల్కర్ చేసిన 673 పరుగులే ఇప్పటివరకు అత్యధికం. టీమిండియా ఫైనల్ వరకు వెళ్లిన ఈ టోర్నీలో సచిన్ సెంచరీతో పాటు ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు.
అయితే, వరల్డ్‌కప్ అసాంతం అద్భుత ప్రదర్శన చేసిన సచిన్ ఫైనల్లో మాత్రం తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. సచిన్ తర్వాత మాథ్యూ హెడెన్(2007లో 659 పరుగులు), మహిళా జయవర్దనే(2007లో 548 పరుగులు), మార్టిన్ గుప్టిల్(2015లో 547 పరుగులు) ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డుని బద్దలు కొట్టేదెవరో ఒక్కసారి చూద్దాం... :

విరాట్ కోహ్లీ
వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు. 2011 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లీ 9 మ్యాచ్‌లాడి 35.25 యావరేజితో 282 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2015 వరల్డ్ కప్‌లో 8 మ్యాచ్‌లాడి 50.83 యావరేజితో 305 పరుగులు చేశాడు. కోహ్లీకి కెప్టెన్‌గా ఇదే మొదటి వరల్డ్‌కప్ కాగా, ఆటగాడిగా మూడోది. ఈ ఏడాది విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండో ఏడాది కూడా 1000 పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీ ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 11 మ్యాచ్‌లాడి 55.45 యావరేజితో 611 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. దీంతో వరల్డ్‌కప్‌లో సచిన్ పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టే ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు.

జానీ బెయిర్ స్టో
ఇంగ్లాండ్‌కు చెందిన ఈ క్రికెటర్ ఐపీఎల్ 12వ సీజన్‌లో పరుగుల వరద పారించాడు. సన్‌రైజర్స్ తరుపున బరిలోకి దిగిన జానీ బెయిర్ స్టో ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లాడి 157.24 స్ట్రయిక్ రేట్‌తో 445 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో ఒకడు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరిస్‌లో కూడా రాణిస్తున్నాడు. బ్రిస్టల్ వేదికగా మే 14న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో బెయిర్ స్టో 93 బంతుల్లో 128 పరుగులతో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

డేవిడ్ వార్నర్
బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత డేవిడ్ వార్నర్ పునరాగమనం అదిరింది. నిషేధం ముగిసిన తర్వాత ఐపీఎల్ 12వ సీజన్‌లో డేవిడ్ వార్నర్ తన పునరాగమనాన్ని చాలా ఘనంగా చాటాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కులు చూపించాడు. పరుగుల వరద పారించాడు. ఈ సీజన్‌లో మొత్తం 12 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్ 69.20 యావరేజితో 692 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ ద్వారా ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో వార్నర్ తాను ఎంత కీలక ఆటగాడినో చెప్పకనే చెప్పాడు.

క్రిస్ గేల్
వరల్డ్‌కప్‌కు ముందు క్రిస్ గేల్ అనూహ్యంగా ఫామ్ అందుకున్నాడు. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో క్రిసే గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 4 ఇన్నింగ్స్‌ల్లో 424 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. ఇక, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్‌లో కూడా క్రిస్ గేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొత్తం 13 మ్యాచ్‌లాడి 150 స్ట్రయిక్ రేట్‌తో 490 పరుగులు సాధించాడు.

రోహిత్ శర్మ
మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ అంటే చాలు చెలరేగుతాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాదిరి రోహిత్ శర్మ కూడా 2017, 18లలో 1000కిపైగా పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఈ సీజన్‌లో 556 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ రికార్డుని బద్దలు టాప్-5 ఆటగాళ్లలో రోహిత్ శర్మ తప్పక ఉంటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications