Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టైం వేస్ట్ చేయొద్దని..: విండీస్ మ్యాచ్‌లో ప్యాడ్లు లేకుండా ధోనీ కీపింగ్

: ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో పెర్త్‌లో శుక్రవారం నాడు జరుగుతున్న మ్యాచ్‌లో భారత క్రికెట్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కాసేపు ప్యాడ్లు లేకుండానే కీపింగ్ చేశాడు. భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇది కనిపించింది.

ధోని తన ప్యాడ్లను రహానేకు ఇచ్చాడు. అశ్విన్ వేసిన కొన్ని బంతులకు అలాగే కీపింగ్ చేశాడు. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ జోనాథన్ కార్టర్ స్ట్రైకింగ్ సైడ్‌లో ఉన్నాడు.

World Cup 2015: When Dhoni kept wickets without pads

ధోనీ ఫార్వార్డ్ షార్ట్ లెగ్ సైడ్ ఫీల్డ్‌కు అజింక్యా రహానేను పిలిచాడు. ఆ సమయంలో మరో ప్యాడ్స్ కోసం సమయం వృథా చేయకుండా తన ప్యాడ్స్ అతనికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కాసేపటికి ధోనీ మళ్లీ ప్యాడ్లు ధరించాడు. కాగా, కీపర్ కాళ్లకు రక్షణ లేకుండా కీపింగ్ చేయడం చాలా అరుదు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+