Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రయోగాలు... చివరకు మూడో స్థానంలో బ్యాటింగ్‌: కోహ్లీ

మెల్‌బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో అందరి కళ్లు టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పైనే ఉన్నాయి. ఆదివారం దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం తనకు సరైనదేనని భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో తనను ఆ స్థానంలో ఆడించడం వల్ల మెరుగైన ప్రదర్శన చేయగలుగుతానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ విషయంపై జట్టు మేనేజ్ మెంట్ కు స్పష్టత రావడంతో ఈ వరల్డ్ కప్ లో తనతో మూడవ స్ధానంలో బ్యాటింగ్ దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ్ కప్‌కు ముందు ఆస్టేలియాలో జరిగిన టెస్టు, వన్డే క్రికెట్ మ్యాచ్‌ల్లో మూడవ స్ధానంలో వచ్చిన మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మేము జట్టులో ఉత్తమ కలయిక ఎప్పుడు దొరుకుతుందా అని ప్రయోగాలు చేస్తుంటాం.

World Cup 2015: Virat Kohli Reiterates Love for No. 3 Batting Position


ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ కు టీమిండియా సన్నద్ధమైన నేపథ్యంలో కోహ్లీ మీడియాతో ముచ్చటించాడు. తాము కొన్ని ప్రయోగాలు చేస్తుంటామని.. అందుకు అభిమానుల నుంచి సహకారం కావాలన్నాడు. ఈ క్రమంలోనే చాలా తప్పులు జరుగుతుంటాయని.. వాటి నుంచి మరికొన్ని విషయాలు నేర్చుకుని ముందుకు వెళుతుంటామని కోహ్లీ తెలిపాడు.

మళ్లీ మ్యాజిక్‌ను చూడొచ్చా అన్న ప్రశ్నకు గాను ప్రతి మ్యాచ్‌లోనూ అభిమానులు సెంచరీ చేయాలని కోరుకుంటారు. కానీ, ఒక్కొటప్పుడు అది సాధ్య పడకపోవచ్చు. మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉంటామని చెప్పారు. భారత్‌కు ప్రతి గేమ్ కూడా ఒక టెస్టు లాంటిదేనని అన్నారు. ఓటమి చవిచూసినప్పుడు ఎక్కడ లోపాలున్నాయో సరిచూసుకుంటాం.

మళ్లీ తిరిగి ఆడేందుకు ప్రయత్నిస్తుంటామని తెలిపారు. ఇది క్రికెట్ అనే ఆట. చేతిలో బ్యాట్, బంతి ఉన్నంతకాలం ఆడేందుకు ప్రయత్నిస్తానన్నారు. క్రీజులో ఉన్నంత సేపు ప్రతి బంతిపైనా ఫోకస్ ఉంటుందన్నారు. సిక్స్ కొట్టాల్సివచ్చినప్పుడు, కూర్చోని ఆలోచించలేం కదా... కాబట్టి ఏ స్ధానంలో వస్తున్నామనేది ముఖ్యం కాదు. మ్యాచ్‌ని గెలిపించేందుకు మన వంతు ప్రయత్నం ఎంత వరకు చేశామనేదే ముఖ్యమన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+