For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతే గానీ సచిన్‌తో పోల్చలేం: విరాట్ కోహ్లీపై బారీ రిచర్డ్స్

By Pratap

పెర్త్: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తన సమకాలీనులకన్నా కొన్ని అడుగులు ముందున్నాడని దక్షిణాప్రికాకు చెందిన ఒకనాటి ప్రముఖ బ్యాట్స్‌మన్ బారీ రిచర్డ్స్ అభిప్రాయ పడ్డాడు. అయితే సచిన్ టెండూల్కర్‌తో పోల్చడానికి అతని ఆటతీరు మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నాడు. ప్రస్తుత భారత జట్టులో విరాట్ కోహ్లీ మిగతా వాళ్లకన్నా కొన్ని అడుగులు ముందున్నాడనడంలో సందేహం లేదని, అతను నిజంగా మంచి టాలెంట్ ఉన్న బ్యాట్స్‌మెన్‌లో ఒకడని, ఎబి డివిలియర్స్‌తో పాటుగా అతను కూడా ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడని ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ విశ్షేషకుల్లో ఒకడుగా భావించే బారీ రిచర్డ్స్ పిటిఐతో అన్నాడు.

అజింక్య రహానే, శిఖర్ ధావన్‌లను కోహ్లీతో ఎలా పోలుస్తారని అడగ్గా, వాళ్లను కోహ్లీతో పోల్చడానికి వీలే లేదని, అతనికి అతనే పోటీ అని రిచర్డ్స్ అన్నాడు. ఇన్నింగ్స్‌ను మలుచుకోవడం అనేది ఓ గొప్ప బ్యాట్స్‌మన్‌కు ఉండే ప్రత్యేక లక్షణమని, కోహ్లీ ఆ పని చాలా సునాయాసంగా చేస్తాడని అన్నాడు. అయితే టెండూల్కర్‌తో పోల్చడానికి ముందు కోహ్లీ తన ఆటను మరింతగా మెరుగుపర్చుకోవలసిన అవసరం ఉందని రిచర్డ్స్ అభిప్రాయ పడ్డాడు.

World Cup 2015: Virat Kohli cannot be compared with Sachin Tendulkar, says Barry Richards

21 ఏళ్ల పాటు దక్షిణాఫ్రికా ప్రపంచ క్రికెట్‌నుంచి దూరంగా ఉండడానికి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల్లో బారీ రిచర్డ్స్ 500కు పైగా పరుగులు చేసాడు. అదే ఆయన ఆడిన ఏకైక టెస్టు సిరీస్ కావడం గమనార్హం. కాగా, ప్రస్తుతం ఫాస్ట్‌బౌలింగ్ క్వాలిటీ క్రమంగా తగ్గిపోతోందని రిచర్డ్స్ అభిప్రాయ పడ్డాడు. మిగతా వాళ్లతో పోలిస్తే డేల్ స్టెయిన్స్ ఓ మెట్టు పైనున్నాడని ఒక గొప్ప ఫాస్ట్ బౌలర్‌కు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు అతనిలో ఉన్నాయని అన్నాడు.

ఇప్పుడు కూడా కొంతమంది మంచి ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నప్పటికీ మొత్తం మీద చూస్తే క్వాలిటీ తగ్గిందని ఆయన అన్నాడు. ఆ రోజుల్లో వెస్టిండీస్ ఫాస్ట్‌బౌలర్లు, డెన్నిస్ లిల్లీ, ఇమ్రాన్‌ఖాన్‌లాంటి గొప్ప ఫాస్ట్‌బౌలర్లు ఉండే వారని ఆయన అన్నాడు. ఆయితే ఇప్పుడు క్రికెట్ అంతా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారిపోయిందని, ఎంత గొప్ప బౌలర్ కూడా ఎడాపెడా పరుగులిచ్చే స్థితి ఉందని ఆయన అన్నాడు. ప్రస్తుత ప్రపంచ కప్‌లో భారీ స్కోర్లు నమోదు అవుతాయని కూడా ఆయన చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+