వరల్డ్ కప్ సెమీ పైనల్ 2: టాస్ కీలకం, ఇరు జట్లు ఐదేసి సార్లు గెలిచాయి
సిడ్నీ: మార్చి 26(గురువారం)న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న రెండో సెమీ పైనల్ మ్యాచ్‌లో భారత్-ఆస్టేలియా జట్లు తలపడుతున్నాయి. 1983 నుంచి ఇప్పటి వరకు భారత్-ఆస్టేలియా జట్లు 11వ సారి వరల్డ్ తలపడుతున్నాయి.
వరల్డ్ కప్‌లో 11 సార్లు ఇండియా-భారత్ తలపడితే, ఏడు సార్లు ఆస్టేలియా గెలుపొందగా, మూడు సార్లు మాత్రమే భారత్ విజయం సాధించింది. 2003 వరల్డ్ కప్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్టేలియా విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది.

భారత్- ఆస్టేలియా మధ్య జరగనున్న వరల్డ్ కప్ సెమీ పైనల్ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు కారణం సిడ్నీలో గత రెండురోజులుగా వర్షం పడుతోంది. మంగళవారం వర్షం కారణంగా సిడ్నీ క్రికెట్ మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.
ఇది ఇలా ఉంటే గురువారం నాడు జరగనున్న మ్యాచ్‌కి వర్షం అంతరాయ కలిగించే సూచనలు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం కారణంగా పిచ్ స్పిన్‌కు అనకూలించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టాస్ గెలిచిన జట్టు ముందు బ్యాటింగ్ ఎంచుకుంటే వారికి పిచ్ అనుకూలంగా ఉంటుందని వాన్ పేర్కొన్నాడు. ఇరు జట్లు కూడా వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఐదేసి సార్లు టాస్‌ను గెలుచుకున్నాయి.
గత వరల్డ్ కప్ టాస్‌లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1983: Kim Hughes (Australia) won the toss and elected to bat [ఆస్టేలియా గెలిచింది]
1983: Kapil Dev (India) won the toss and elected to bat [భారత్ గెలిచింది]
1987: Kapil Dev (India) won the toss and elected to field [ఆస్టేలియా గెలిచింది]
1987: Allan Border (Aus) won the toss and elected to field [భారత్ గెలిచింది]
1992: Allan Border (Aus) won the toss and elected to bat [ఆస్టేలియా గెలిచింది]
1996: Mark Taylor (Aus) won the toss and elected to bat [ఆస్టేలియా గెలిచింది]
1999: Mohammad Azharuddin (India) won the toss and elected to field [ఆస్టేలియా గెలిచింది]
2003: Sourav Ganguly (India) won the toss and elected to bat [ఆస్టేలియా గెలిచింది]
2003: Sourav Ganguly (India) won the toss and elected to field [ఆస్టేలియా గెలిచింది]
2011: Ricky Ponting (Aus) won the toss and elected to bat [భారత్ గెలిచింది]
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications