మెల్‌బోర్న్: ఈసారి వరల్డ్‌క్‌పలో టీమిండియా అత్యంత ప్రమాదకరమైన జట్టు అని ఆస్ర్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ హెచ్చరించాడు. భారత జట్టులో చాలామంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారన్నాడు. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్ నిలబెట్టుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఆస్ర్టేలియా గడ్డపై టెస్ట్, ముక్కోణపు సిరీ్‌సలో భారత్ సమస్యలు ఎదుర్కొన్న విషయం నిజమేనని, ధోనీసేన సామర్థ్యం మేరకు ఆడితే ఇతర జట్లకు ప్రమాదకారి అవుతుందని ఆయన అన్నాడు. పాక్‌పై విజయంతో ధోనీసేన ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా రెట్టింపు అయిందని, టీమిండియా బ్యాటింగ్ అద్భుతమని అందరికీ తెలుసునని, బౌలింగ్ మాత్రం చాలా బలహీనంగా ఉందని అన్నాడు.

కాబట్టి బౌలర్లు తమ ప్రదర్శన మెరుగుపర్చుకోవాలని, కాగా సొంతగడ్డపై ఆసీస్ టైటిల్ నెగ్గుతుందని భావిస్తున్నానని అన్ాడు. ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఆకట్టుకుందని, అలాగే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లకూ టైటిల్ అవకాశాలు ఉన్నాయని, కివీ్‌సకు స్వదేశంలో మెరుగైన రికార్డు ఉందని పాంటింగ్ తెలిపాడు.
మీరు ఫేవరైట్స్ అయినంత మాత్రాన ఏమీ జరగదని, టైటిల్ సాధించడానికి, అయితే జట్టు ఈసారి చాలా బలంగా ఉందని ఆయన ఆస్ట్రేలియా జట్టును ఉద్దేశించి అన్నాడు. ప్రపంచ కప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో జరగడంపై ఆయన మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లు బ్యాటింగ్‌ను, బౌలింగ్‌ను, ఫీల్డింగు వ్యూహాలను మార్చుకోవడం కష్టమని అన్నాడు.