వార్నర్ తగ్గితే నేను భారత ఆటగాళ్లను తిడుతా: జాన్సన్
సిడ్నీ: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. భారత ఆటగాళ్లపై నోరు పారేసుకున్న డేవిడ్ వార్నర్ వెనక్కి తగ్గితే తాను నోరు చేసుకుంటానని ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ అన్నారు. టెస్ట్ సిరీస్ సందర్భంగా డేవిడ్ వార్నర్ భారత ఆటగాళ్లపై దూషణలకు దిగి శిక్షను కూడా అనుభవించాడు.
తాను దూషణలకు దూరంగా ఉంటానని డేవిడ్ వార్నర్ అన్నట్లు తాను విన్నానని, అయితే ఆ పని ఎవరో ఒకరు చేయాలని, తాను ఆ పనిచేస్తానని, అది కూడా ఆటలో భాగమని అన్నాడు. అది వినోదాన్ని పంచే విషయమని, ఈ ఆటలో దాన్ని చూడబోతున్నారని ఆయన అన్నాడు.

భారత్‌తో ఆడే సమయంలో దూషణలకు జాన్సన్ దూషణలకు దిగిన సందర్భాలున్నాయి. గత డిసెంబర్‌లో గబ్బా స్టేడియంలో తనకు వికెట్ లభించకపోవడంతో అటువంటి చర్యకు దిగాడు. తాను ఫలితం సాధించడాన్ని ప్రేమిస్తానని, ఎంతగా తనకు ఫలితం దక్కితే అంత మంచిదని ఆయన అన్నారు.
టెస్టు సిరీస్ సందర్భంగా జరిగిన వివాదాల కారణంగా డేవిడ్ వార్నర్‌కు, భారత ఆటగాళ్లు శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ, విరాట్ కోహ్లీలకు జరిమానా పడిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications