For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్: ఇంగ్లాండ్‌పై ఆసీస్ ఘన విజయం.. బౌలర్లే గెలిపించారు (ఫోటోలు)

By Nageswara Rao

మెల్ బోర్న్: ప్రపంచ కప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగుల తేడాతో ఆస్టేలియా ఘన విజయం సాధించింది. 343 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 41.5 ఓవర్లలో 231 పరుగులక్ ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. ఇంగ్లాండ్ జట్టులో అత్యధికంగా టేలర్ 98 పరుగులు సాధించాడు. ఆ తర్వాత వోక్స్ 37, బెల్ 36, పరుగులు చేయగా మిగతా బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితమయ్యారు.

ఆస్టేలియా బౌలర్లలో మిచెల్‌ మార్ష్‌ 5 వికెట్లు తీసుకోగా, మిచెల్ జాన్సన్ 2, స్టార్క్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫిన్ 5, బ్రాడ్ 2 వికెట్లు తీసుకోగా, వోక్స్ ఒక వికెట్ తీసుకున్నాడు.

World Cup 2015: Australia vs England, Match 2

మెల్‌బోర్న్‌లో ఆస్టేలియాతో జరిగిన మ్యాచ్‌లో వోక్స్ 37 పరుగుల వద్ద జాన్సన్‌ బౌలింగ్‌లో క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ ఏడో వికెట్‌ను కోల్పోయింది. 36 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్లను కోల్పోయి 194 పరుగులు చేసింది.

ఆసీస్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ వికెట్లు ఒక్కొక్కటిగా పడుతున్నాయి. 30 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లను కోల్పోయి 153 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఆస్ట్రేలియా బౌలర్‌ మిచెల్‌ మార్ష్‌ కోలుకోలేని దెబ్బతీశాడు. ఏడు ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీశాడు.

World Cup 2015: Australia vs England, Match 2

16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. దూకుడుగా ఆడుతున్న బెల్‌(36)ను ఔట్‌ చేసిన మార్ష్‌.. తర్వాత బంతికే రూట్‌(5)ను పెవిలియన్‌ దారి పట్టించాడు. దీంతో ఇంగ్లాండ్‌ 14 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లను కోల్పోయి 66 పరుగులు సాధించింది. 12 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది.

నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసిన ఆస్ట్రేలియా:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫిన్ 5, బ్రాడ్ 2 వికెట్లు తీసుకోగా, వోక్స్ ఒక వికెట్ తీసుకున్నాడు. చివరి ఓవరల్ ఇంగ్లాండ్ బౌలర్ ఫిన్ హ్యాట్రిక్ వికెట్లు తీసుకుని ఈ ఏడాది వరల్డ్ కప్‌లో ఫస్ట్ హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్న ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. ఇక సెంచరీ సాధించిన ఫించ్‌ (135) పరుగుల వద్ద రనౌట్‌ అయ్యాడు.

102 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో వంద పరుగులు పూర్తిచేశాడు. ఫించ్‌కు ఈ ప్రపంచ్‌కప్‌లో ఇది తొలి సెంచరీ. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ బెయిలీ అర్ధ శతకం నమోదు చేశాడు. అర్ధ సెంచరీ సాధించిన కెప్టెన్‌ బెయిలీ 55 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోరు వద్ద ఫిన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 63 బంతుల్లో మూడు ఫోర్లతో 50 పరుగులు చేశాడు.

World Cup 2015: Australia vs England, Match 2

ఆస్ట్రేలియా 200 పరుగుల మైలు రాయిని దాటింది. ఫించ్‌(133) సెంచరీ సాధించి దూకుడుగా ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి నాల్గవ వికెట్‌కు అజేయంగా 136 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం 36 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్‌ మూడు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

ప్రస్తుతం 30.2 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్‌ మూడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ప్రపంచకప్‌ వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ఫించ్‌ దూకుడుగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్ రూట్‌ వేసిన 25వ ఓవర్‌లో ఫించ్‌ ఒక ఫోర్‌, ఒక సిక్స్‌ కొట్టాడు. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్‌ మూడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 20 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

World Cup 2015: Australia vs England, Match 2

ఆస్టేలియా బ్యాట్స్‌మెన్ స్మిత్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో ఆస్టేలియా 10.3 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. ఆస్టేలియా 10 ఓవర్లకు గాను 2 వికెట్లను కోల్పోయి 66 పరుగులు చేసింది.

ఆస్టేలియా వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. బ్రాడ్ బౌలింగ్‌లో షేన్ వాట్సన్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆస్టేలియా ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రాడ్ బౌలింగ్‌లో అవుట్ అవ్వడంతో ఆసీస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 7 ఓవర్లు ముగిసే సరికే ఒక వికెట్ నష్టానికి 57 పరగులు చేసింది. ఆస్టేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫించ్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+