పెర్త్: ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు పేరిట ఉన్న 413 పరుగుల రికార్డును ఆస్ట్రేలియా జట్టు బ్రేక్ చేసింది.2007లో జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో బెర్ముడా దేశంపైన భారత జట్టు 5వికెట్లు కోల్పోయి 413 పరుగులు చేసింది. కాగా, బుధవారం ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లు కోల్పోయి 417 పరుగులు చేసింది.
50 ఓవర్లు ఆడిన ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి 417 పరుగులు చేసింది. దీంతో ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆసీస్ చరిత్ర సృష్టించింది.

కాగా, ఈ ఏడాది ప్రపంచ కప్ టోర్నీలో 400 పరుగుల మైలురాయి దాటడం ఇది మూడవ సారి కావడం గమనార్హం. 40ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒకే టోర్నీలో మూడు సార్లు 400 పరుగులు దాటడం ఇదే తొలిసారి.
చెలరేగి ఆడిన డేవిడ్ వార్నర్ 178(19ఫోర్లు, 5సిక్సులు) పరుగులు చేయగా, మాక్స్‌వెల్ 39 బంతుల్లో 88(6ఫోర్లు, 7సిక్సులు) పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కాగా, స్టీవ్ స్మిత్ 95(8ఫోర్లు, 1సిక్సు) పరుగులతో రాణించాడు.