2011 వరల్డ్‌కప్ విక్టరీ: ఆ మధుర జ్ఞాపకాన్ని నెమరువేసుకున్న సచిన్, సెహ్వాగ్

2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖడే మైదానంలో శ్రీలంకతో జరిగిన పైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి ధోని నాయకత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధుర జ్ఞాపకాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బుధవారం నెమరువేసుకున్నారు. తాజాగా ఆ మధురక్షణాలను సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్లో గుర్తు చేసుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
జీవితంలో బెస్ట్ మూమెంట్
"నా క్రికెట్ జీవితంలో బెస్ట్ మూమెంట్" అంటూ సచిన్ టెండూల్కర్ ఓ వీడియోని అభిమానుల కోసం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. "క్రికెట్ ఫీల్డ్‌లో నా జీవితంలోనే అదొక అద్భుతమైన రోజు. అప్పుడు ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఇంకా జట్టుని ప్రకటించలేదు. ఎవరైతే జట్టులో సెలక్ట్ అవుతారో, అది మన టీమ్" అంటూ సచిన్ ఆ వీడియోలో చెప్పారు.
సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదేరోజున: సెహ్వాగ్ ఇలా
ఇక, సెహ్వాగ్ సైతం తన ట్విట్టర్‌లో 2011 వరల్డ్ కప్ మధుర జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన ట్విట్టర్‌లో "WHAT A DAY! వరల్డ్ కప్ 2011. సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదేరోజున, కల నిజమైతే యావత్ భారతావని సంబరాలు చేసుకుంది. నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావ్?" అని సెహ్వాగ్ కామెంట్ పెట్టాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. శ్రీలంక జట్టులో మహేలా జయవర్ధనే 103 పరుగులు, సంగక్కర 48 పరుగులు చేశారు. అనంతరం 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. సెహ్వాగ్ డకౌట్ కాగా, సచిన్(18) పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.

తనదైన శైలిలో సిక్స్ బాదిన ధోని
ఈ మ్యాచ్‌లో గంభీర్(97) పరుగులతో ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (91), యువరాజ్‌సింగ్(21) జట్టుకు విజయాన్ని అందించారు. చివరి 11 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా ధోని తనదైన శైలిలో సిక్స్ బాదాడు. భారత్‌కు ఇది రెండో వన్డే వరల్డ్ కప్. 1983లో కపిల్ నాయకత్వంలోని టీమిండియా తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను నెగ్గింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications