Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దిగ్గజాల పోరు: ఇవాళ భారత్ -పాక్ ఫైనల్.. లైవ్ ఎలా చూడాలంటే?

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2024 క్లైమాక్స్‌కు చేరింది. ఇవాళ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి 'పాకిస్థాన్ ఛాంపియన్స్‌'తో ఇండియా ఛాంపియన్స్ తలపడనుంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది.భారత కాలమాన ప్రకారం రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్, వెస్టిండీస్‌పై పాకిస్థాన్ విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయి. ఫామ్ పరంగా చూస్తే ఇండియా కంటే పాకిస్థాన్ బలంగా ఉంది. గ్రూప్ దశలో పాక్ ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో విజయం సాధించింది. బలమైన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌ను ఓడించింది. దక్షిణాఫ్రికా చేతిలో మాత్రం ఓడింది.

World Championship of Legends 2024 India-Pakistan Final Today How to Watch Live

ఇక సెమీస్‌లో వెస్టిండీస్‌పై 20 పరుగుల తేడాతో పాకిస్థాన్ నెగ్గింది. ఈ టోర్నీలో పాక్‌కు ప్రధాన బలం వాళ్ల బ్యాటింగే. మరోవైపు ఇండియా ఛాంపియన్స్ గ్రూప్ దశలో ఆడిన అయిదింట్లో రెండు విజయాలు సాధించి సెమీస్‌కు చేరింది. దక్షిణాఫ్రికాతో సమానమైన పాయింట్లు ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేటుతో నాకౌట్ స్టేజ్‌కు వచ్చింది. అయితే కీలక దశలో భారత్ సూపర్ ఫామ్‌లోకి వచ్చింది. ఆస్ట్రేలియాపై అద్భుతంగా చెలరేగి ఫైనల్‌కు చేరింది.

అయితే ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించాలంటే భారత బ్యాటర్లు మరోసారి చెలరేగాలి. రాబిన్ ఉతప్ప, పఠాన్ బ్రదర్స్ ఇర్ఫాన్ పఠాన్ మంచి లయలో ఉండటం సానుకూలాంశం. యువరాజ్ సింగ్ కీలక దశలో ఊపందుకున్నాడు. సురేశ్ రైనా, అంబటి రాయుడు కూడా చెలరేగితే భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయం. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో రాయుడును భిన్నమైన స్థానాలు కొనసాగించడం సత్ఫలితాల్ని ఇవ్వట్లేదు. ఈ టోర్నీలో రాయుడును కొన్నిసార్లు టాప్ ఆర్డర్‌లో, మరికొన్ని సార్లు ఫినిషర్‌గా పంపించారు.

కాగా, భారత్-పాకిస్థాన్ ఫైనల్‌ ప్రత్యక్షప్రసారం చూడాలంటే.. టీవీలో స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతుంది. మొబైల్స్‌లో చూడాలనుకుంటే ఫ్యాన్‌కోడ్ యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో లైవ్ చూడవచ్చు. ఈ మ్యాచ్ స్థానికంగా సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది.

Story first published: Saturday, July 13, 2024, 9:55 [IST]
Other articles published on Jul 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+