Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీ శరీరం చెప్పేదే వినండి: ఆటగాళ్ల పనిభారంపై రోహిత్ శర్మ

IPL 2019 : Rohith Sharma And Sourav Ganguly On Players Workload Management | Oneindia Telugu
Workload management: Rohit, Zaheer tell players to listen to their bodies

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశమున్న ఆటగాళ్లు.. ఐపీఎల్‌లో పనిభారాన్ని సమీక్షించుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సీజన్‌లో కూడా ఇంటా, బయటా పద్ధతిలో ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే, కీలక ఆటగాళ్లు మ్యాచ్‌లు తగ్గించుకోవాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

తమ శరీర స్థితిని బట్టి మ్యాచ్‌లు ఆడాలి

తమ శరీర స్థితిని బట్టి మ్యాచ్‌లు ఆడాలి

ఇలాంటి తరుణంలో ఆటగాళ్లు ఎవరికి వారు తమ శరీర స్థితిని బట్టి మ్యాచ్‌లు ఆడాలని ఐపీఎల్‌‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. మంగళవారం ఆ జట్టు మెంటార్ జహీర్ ఖాన్‌తో కలిసి రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఆటగాళ్ల పనిభారంపై మాట్లాడాడు.

నాలుగేళ్లుగా దేశ విదేశాల్లో తిరుగుతూనే ఉన్నాం

"గత నాలుగేళ్లుగా దేశ విదేశాల్లో తిరుగుతూనే ఉన్నాం. ఇటీవల విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడాం. ఐతే ఐపీఎల్‌లో ఎలా వ్యవహరించాలన్నది ఆటగాళ్ల వ్యక్తిగత విషయం. ఆటగాళ్లు తమ శరీరం ఏం చెబుతోందో వినాలి. ప్రపంచకప్‌ చాలా ముఖ్యమైన టోర్నీనే. కానీ ఐపీఎల్‌ కూడా పెద్దదే. దానికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే" అని రోహిత్‌ శర్మ చెప్పాడు.

ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే ఐపీఎల్ ఆడటమే ఉత్తమం

ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే ఐపీఎల్ ఆడటమే ఉత్తమం

"అన్నీ చూసుకుని పని భారాన్ని అంచనా వేసి ఎన్ని మ్యాచ్‌లు ఆడాలన్నది ఆటగాళ్లే నిర్ణయం తీసుకోవాలి" అని రోహిత్‌ శర్మ చెప్పాడు. మరోవైపు తమ పేసర్ బుమ్రా.. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే ఐపీఎల్ ఆడటమే ఉత్తమమని కోచ్ జయవర్ధనే సూచించాడు. భారత పేసర్ల ఫిట్‌నెస్‌పై ఎలాంటి ఆందోళన లేదని అన్నాడు.

పాండ్యాపై పనిభారాన్ని ఐపీఎల్‌లో పర్యవేక్షిస్తాం

పాండ్యాపై పనిభారాన్ని ఐపీఎల్‌లో పర్యవేక్షిస్తాం

సరైన ప్రణాళికతో శారీరక శ్రమను జయించాలని అన్నాడు. ఇక, ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలువడం చాలా ప్రధానమైందని ముంబై మెంటార్ జహీర్ ఖాన్ చెప్పాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై పనిభారాన్ని ఐపీఎల్‌లో పర్యవేక్షిస్తామని జహీర్ ఖాన్ అన్నాడు.

Story first published: Wednesday, March 20, 2019, 10:56 [IST]
Other articles published on Mar 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+