కోహ్లీలా కష్టపడితేనే: వెస్టిండిస్ ఆటగాళ్లకు కోచ్ సూచన

హైదరాబాద్: తమ జట్టులోని యువ ఆటగాళ్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలా కష్టపడాలని వెస్టిండీస్ క్రికెట్ జట్టు సహాయ కోచ్ రాడీ ఎస్ట్‌విక్ అన్నాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఆదివారం చెన్నై వేదికగా జరగనుంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం అతను మీడియాతో మాట్లాడుతూ "హెట్‌మయర్, పూరన్, హోప్ లాంటి యువ ఆటగాళ్లు ఎదుగుతున్న తీరు మాకు ఉత్సాహాన్నిస్తోంది. అయితే వీళ్లందరూ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలి. కష్టపడేందుకు ఎంత సన్నద్ధంగా ఉన్నారన్నది కీలకం" అని అన్నాడు.
"ఆట కోసం అతను ఎంతో శ్రమిస్తాడు. అతను క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్తాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తాడు. కఠోరంగా శ్రమించేతత్వానికి అతనే ఓ నిదర్శనం. అతణ్ని చూసి చాలామంది ఆటగాళ్లు నేర్చుకోవాల్సి ఉంది. కష్టపడకుండా విజయం రాదు. శ్రమ విసుగు తెప్పిస్తుంది. కానీ అది గొప్ప విజయాలను అందిస్తుంది" అని కోచ్ తెలిపాడు.
టి20 సిరీస్‌లో రాణించినట్లే ఈ వన్డే సిరీస్‌లోనూ తమ జట్టు రాణిస్తుందని రాడీ ఎస్ట్‌విక్ తెలిపాడు. తమ ఆటగాళ్లకు ఈ పర్యటన ఓ పాఠంలా పనికొస్తుందని అన్నాడు. మూడు టీ20ల సిరిస్‌ను విండిస్ 1-2తో కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే చెన్నైలో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications