Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: విరాట్ కోహ్లీ సీక్రెట్ వరల్డ్ కప్ డైట్ ఇదే!

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఫిట్‌గా ఉన్న ప్లేయర్ ఎవరంటే అందరూ చటుక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ. తన ఫిట్‌నెస్‌తో ప్రపంచంలోనే ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసిన ఈ రన్ మెషీన్.. వరల్డ్ కప్‌లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. సింగిల్ వచ్చే దగ్గర డబుల్స్ తీస్తూ ఫీల్డర్లపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నాడు.

మరి ఇంత ఫిట్‌గా ఉండటానికి కోహ్లీ ఏం తింటున్నాడు? అతని వరల్డ్ కప్ డైట్ ఏంటి? అని చాలా మందికి అనుమానం వచ్చే ఉంటుంది. ఈ క్రమంలో వరల్డ్ కప్ కోసం టీమిండియా దిగిన ఒక ప్రముఖ హోటల్‌లో ఎగ్జిక్యూటివ్ చెఫ్.. ఈ విషయం వెల్లడించాడు. కోహ్లీ డైట్ ఏంటో బయటపెట్టాడు.

Wordl Cup 2023 INDvsENG Virat Kohli secret CWC2023 diet revealed

ఈ వరల్డ్ కప్‌లో చాలా మంది ప్లేయర్లు ఎక్కువ ప్రొటీన్‌తో తక్కువ కార్బొహైడ్రేట్స్ ఉండే ఆహారమే తీసుకుంటున్నట్లు సదరు చెఫ్ తెలిపాడు. కొందరు ప్లేయర్లు గ్రిల్డ్ ఫిష్, చికెన్ తీసుకుంటున్నారట. అయితే వీగన్ అయిన కోహ్లీ మాత్రం టోఫూ, సోయా బేస్డ్ భోజనంతోనే తన ప్రొటీన్ అవసరాలు తీర్చుకుంటున్నాడని తెలుస్తోంది.

'బఫెట్‌లో అన్ని రకాల మాంసాహారం ఉంటుంది. కానీ ప్లేయర్లు మాత్రం స్టీమ్డ్ లేదంటే గ్రిల్డ్ చికెన్ లేదా ఫిష్ మాత్రమే తీసుకుంటున్నారు' అని చెప్పాడు లీలా ప్యాలెస్‌లో ఎగ్జిక్యూటివ్ చెఫ్ అన్షుమన్ బాలి. అయితే విరాట్ మాత్రం మాంసం తినడని, కాబట్టి అతను ఎక్కువగా స్టీమ్డ్ ఆహారమే తీసుకుంటున్నాడని తెలియజేశాడు.

'వెజిటేరియన్ డిమ్ సమ్స్‌తోపాటు వెజిటబుల్ ఆధారిత ప్రొటీన్స్, అంటే సోయా, మాక్ మీట్స్, టోఫూ వంటి లీన్ ప్రొటీన్స్ తీసుకుంటున్నాడు. కుదిరితే అతని భోజనంలో సాధ్యమైనంత తక్కువ డైరీ పదార్థాలు ఉండేలా చూసుకుంటాం' అని వెల్లడించాడు. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ ప్లేయర్లు ఎక్కువగా స్టీమ్డ్ లేదా సాటెడ్ వెజిటేబుల్స్‌ తీసుకుంటారు.

వాటితోపాటు కుదిరితే స్టీమ్డ్ ఫిష్ లేదా చికెన్‌ను లంచ్‌లో తీసుకోవడానికి ఇష్టపడతారు. డెవాన్ కాన్వే మాత్రం అప్పుడప్పుడూ పరాఠాలు తింటాడు. టీమిండియా ఫేవరెట్ డిష్‌లలో రాగి దోశ ఒకటని అన్షుమన్ చెప్పాడు. అలాగే ఏదైనా మ్యాచ్ గెలిచినప్పుడు చిన్న పార్టీ చేసుకుంటే తప్ప ప్లేయర్లు ఎవరూ కూడా ఆల్కహాల్ తీసుకోవడం లేదని చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, October 27, 2023, 13:47 [IST]
Other articles published on Oct 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+