తమీమ్ ఒంటిచేత్తో ఆడినప్పుడే.. ఆసియాకప్ గెలిచేశామన్న బంగ్లా కెప్టెన్


హైదరాబాద్: ఆసియాకప్ ఆరంభ మ్యాచ్‌లో తమీమ్ ఇక్బాల్ ఒంటిచేత్తో బ్యాటింగ్ చేసినప్పుడే తాను ఆసియాకప్‌ను గెలిచేశామని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫే మొర్తజా అన్నాడు. టోర్నీలో భాగంగా బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 37 పరుగుల తేడాతో విజయం సాధించి ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
శుక్రవారం జరిగే పైనల్లో బంగ్లాదేశ్ జట్టు భారత్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మష్రఫే మొర్తజా మాట్లాడుతూ "నేను నిజాయతీగా చెప్తున్నా. శ్రీలంకపై తమీమ్ ఇక్బాల్ గాయపడ్డా ముష్ఫికర్‌కు అండగా ఉండేందుకు ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడే నేను ఆసియాకప్ గెలిచేశా. మేమంతా అతని పోరాటస్ఫూర్తికి ఫిదా అయిపోయాం" అని అన్నాడు.

పాత తప్పులను పునరావృతం చేయబోం
"మాకు ప్రతి టోర్నీ ముఖ్యమే. ప్రతిసారీ మేం కొన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. వాటిని అధిగమించి ఫైనల్స్‌కు చేరుకుంటున్నాం. 2012, 2016లో రెండుసార్లు ఫైనల్లో ఓడిన తాము పాత తప్పులను పునరావృతం చేయబోం. ఈసారి టోర్నీ చాలా క్లిష్టంగా సాగింది. ప్రస్తుత టోర్నీలో మా ప్రయాణం ఒడుడొదుకుల మధ్య సాగుతోంది" అని మొర్తజా చెప్పాడు.

ఆరంభంలోనే మా ప్లేయర్లు గాయపడ్డారు
"ఆరంభంలోనే మా ప్లేయర్లు గాయపడ్డారు. ముష్ఫికర్ ఫిట్‌గా లేకపోవడంతో ఆడుతాడో లేదోనన్న సందేహం. అతని చూసి చాలా నేర్చుకున్నాం. ఇక గత రెండు టోర్నీల్లో మా శక్తి మేరకు ప్రయత్నించాం. కానీ ప్రతి టోర్నీ ఓ కొత్త రకమైన సవాళ్లను విసిరింది. ఆటగాళ్లు గాయాల పాలై ఇంటికి వెళ్తున్నారు" అని తెలిపాడు.

భారత్ వరల్డ్ నంబర్‌వన్ జట్టు
"రహీమ్ అసౌకర్యంగా ఉన్నా ఆడుతున్నాడు. అతడి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అప్పట్లో ఉన్న పరిస్థితుల వల్ల వాటిని అధిగమించలేకపోయాం. ఇప్పుడు భారత్ వరల్డ్ నంబర్‌వన్ జట్టు. మాకంటే చాలా మెరుగ్గా ఉన్నారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగుతోంది. అయితే క్రికెట్‌లో ఏమైనా జరగొచ్చు. కాబట్టి భారత్‌పై గెలవాలంటే మా శక్తులన్నింటిని ప్రయోగించాల్సిందే" అని తెలిపాడు.

పాక్ మ్యాచ్ తర్వాత ప్రధాని షేక్ హసీనా మాతో మాట్లాడారు
"చివరి వరకు మా భావోద్వేగాలను నియంత్రించుకోవడం ముఖ్యం. టీమిండియా బలాన్ని చూస్తుంటే 260-270 పరుగులు పోరాడగలిగే లక్ష్యం కావచ్చు. ముందు మేం బౌలింగ్ చేస్తే మాత్రం వారు ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకోవాలి. ఏదైనా మంచి ఆరంభం ముఖ్యం. పాక్ మ్యాచ్ తర్వాత ప్రధాని షేక్ హసీనా మాతో మాట్లాడారు. ఫైనల్‌కు ప్రేరణ కల్పించారు. అత్యుత్తమంగా ఆడాలని సూచించారు" అని మొర్తజా అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications