For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భజ్జీ టీవి యాడ్‌ని వివాదంలోకి లాగొద్దు: విజయ్ మాల్యా

By Nageswara Rao
Vijay Mallya
ముంబై: నిన్న హర్బజన్ సింగ్ తల్లి యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఛైర్మన్ విజయ్ మాల్యాకి లీగల్ నోటీసు అందించిన విషయం తెలిసిందే. మెక్ డోవెల్స్ కమర్షియల్ యాడ్‌లో సిక్కు మతస్దుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని నోటీసు అందుకున్న మూడు రోజుల్లోపు సదరు ప్రకటనను ఆపివేయాలని. అన్ని పత్రికలు, టీవీ ఛానెళ్లలో హర్భజన్‌ కుటుంబానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. ఆ తర్వాత దీనిపై స్పందించిన మాల్యా లాయర్ పెర్నాడ్ రిచర్డ్ మేము హర్బజన్ సింగ్‌‍ని దృష్టిలో పెట్టుకోని మాత్రం యాడ్ తీయలేదు. కేవలం ఇది రెండు బ్రాండ్స్‌కి మద్య ఉన్న పోటీ మాత్రమేనని అన్నారు.

అంతేకాకుండా విజయ్ మాల్యా ఫ్రాన్స్ నుండి ఫోన్‌లో మాట్లాడుతూ మేము చాలా పొడవైన లీగల్ నోటీసు అందుకోవడం జరిగింది. ఆ లీగల్ నోటీసుని మా లాయర్స్ పూర్తిగా చదివి, దానికి అనుసరించాల్సిన విధివిధానాలను వెల్లడిస్తారని తెలియజేశారు. చివరగా చాలా టివి ప్రోగ్రామ్స్‌లలో పోలిటిషియన్స్‌కి సంబంధించి కామెడీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇలా ఐతే పోలిటీషియన్స్ ఎన్నో సార్లు టివి ఛానల్స్‌కి లీగల్ నోటీసులు పంపించాల్సి ఉంటుందని అన్నారు.

అసలు ఇంతకీ ఆ ప్రకటనలో ఏముందని అనుకుంటున్నారా..రాయల్‌స్టాగ్‌ ప్రచారకర్త అయిన హర్భజన్‌ ఆ సంస్థ కోసం 'మేక్‌ ఇట్‌ లార్జ్‌' అన్న నినాదంతో ఓ ప్రకటన చేశాడు. దీనిపై వ్యంగ్యంగా మాల్యా గ్రూప్‌నకు చెందిన మెక్‌డోవెల్స్‌.. ప్రకటన రూపొందించింది. అందులో హర్భజన్‌ను పోలిన వ్యక్తి బాల్‌బేరింగులు తయారు చేసే సంస్థ యజమానికి కొడుకు. అతను బేరింగులను పెద్ద సైజుల్లో తయారు చేస్తాడు. తండ్రి వచ్చి ఇదేం పనంటూ అతణ్ని కొడతాడు. 'మేక్‌ ఇట్‌ లార్జ్‌' అన్నందుకే ఇలా చేశానంటూ బదులిస్తాడు. ఈ వ్యవహారాన్ని తెరపై చూపిస్తూ ధోనీ.. ''మేక్‌ ఇట్‌ లార్జ్‌ కాదు.. థింక్‌ డిఫరెంట్‌'' అని వ్యాఖ్యానిస్తాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+